Begin typing your search above and press return to search.

#టాలీవుడ్..బిగ్ డీల్స్ తో వేడెక్కిస్తున్న వ‌రంగ‌ల్ శ్రీ‌ను!!

By:  Tupaki Desk   |   24 Jan 2021 11:10 AM GMT
#టాలీవుడ్..బిగ్ డీల్స్ తో వేడెక్కిస్తున్న వ‌రంగ‌ల్ శ్రీ‌ను!!
X
దిల్ రాజును కిల్ రాజు!! అని ఎలాంటి బెరుకు లేకుండా విమ‌ర్శించిన వ‌రంగ‌ల్ శ్రీ‌ను థియేట‌ర్ల సిండికేట్ భోగోతాన్ని బ‌య‌ట‌పెట్ట‌డంతో ప్ర‌స్తుతం దీనిపై టాలీవుడ్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. దిల్ రాజు- శిరీష్ బృందం గురించి ర‌క‌ర‌కాల ముచ్చ‌ట్లు వేడెక్కిస్తున్నాయి. పెద్ద‌వాళ్ల‌తో త‌ల‌పడి పైచేయి సాధించాడంటూ వ‌రంగల్ శ్రీ‌నును హైలైట్ చేస్తున్నాయి కొన్ని శ‌క్తులు.

అయితే నైజాంలో వ‌రంగ‌ల్ శ్రీ‌ను రేంజు ఎంత‌? అన్న‌దానిపై మాత్రం ఎవ‌రికీ స్ప‌ష్ఠ‌త లేనే లేదు. వరంగల్ శ్రీను ఇంత‌కుముందు నైజాంలో ఇస్మార్ట్ శంకర్- గద్దలకొండ గణేష్- క్రాక్ వంటి చిత్రాలను పంపిణీ చేశారు. అత‌డు దిల్ రాజు .. ఏషియన్‌ సునీల్ లకు కొత్త పోటీదారుగా మారుతున్నాడ‌న్న గుస‌గుసా ఉంది. కార‌ణం ఏదైనా అత‌డు కొనుక్కున్న క్రాక్ మూవీకి స‌రైన థియేట‌ర్ల‌కు ఇవ్వ‌క‌పోవ‌డంతో గొడ‌వ‌కు దిగి బ‌య‌ట‌ప‌డ్డాడు. ఆ గొడ‌వ నిర్మాతల మండలికి చేరుకోవ‌డంతో అక్క‌డ‌ ప్రస్తుతానికి ఈ వివాదం స‌ద్ధుమ‌ణిగినా ఇప్పుడు ఇరు వైరివ‌ర్గాల మ‌ధ్య ఏం జ‌ర‌గ‌నుందోన‌న్న టాక్స్ వేడెక్కిస్తున్నాయి.

ప్ర‌స్తుతం నైజాం లో ప‌లు థియేట్రికల్ ఒప్పందాలను సంపాదించడానికి వ‌రంగ‌ల్ శ్రీ‌ను ప‌లువురు ప్ర‌ముఖ నిర్మాతలను కలుసుకున్నాడు. త్వరలో విడుదల కానున్న శ్రీకారం -విరాఠ‌ పర్వం థియేట్రికల్ హక్కులను ఆయన సొంతం చేసుకున్నారు. మ‌హేష్ న‌టిస్తున్న‌ `సర్కారు వారి పాట`.. అల్లు అర్జున్ `పుష్ప` నైజాం థియేట్రికల్ హక్కుల కోసం నిర్మాత‌ల‌కు భారీ మొత్తాల్ని ముట్ట‌జెప్ప‌డానికి వ‌రంగ‌ల్ శ్రీ‌ను ప్లాన్ చేశాడ‌‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. పుష్ప‌ను నిర్మిస్తున్న‌ మైత్రి అధినేత‌కు ఆయ‌న ట‌చ్ లో ఉన్నాడ‌ని డీల్ ఫైన‌ల్ అయ్యే అవ‌కాశం ఉంద‌న్న టాక్ కూడా వినిపిస్తోంది.

మరోవైపు పెద్ద సినిమాల కొనుగోలు కోసం అత‌డితో వార్ లో దిల్ రాజు - లక్ష్మణ్ కూడా ఉన్నార‌ని మ‌రోసారి సీన్ వేడెక్కే వీలుంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. బిగ్ జియాంట్స్ తో పోటీప‌డేందుకు వ‌రంగ‌ల్ శ్రీ‌ను ఏకంగా 90కోట్ల వ‌ర‌కూ వెద‌జ‌ల్లే ప్లాన్ లో ఉన్నాడ‌న్న గుస‌గుసా వేడెక్కిస్తోంది. ఇదంతా చూస్తుంటే నైజాంలో దిల్ రాజు.. నారంగ్ దాస్ వంటి వారికి పంపిణీ రంగంలో తీవ్ర‌మైన పోటీ ఎదుర‌వుతోంద‌ని భావించ‌క త‌ప్ప‌దు. ఈ వార్ లో ఎలాంటి కుయుక్తులు.. రాజ‌కీయాలు తెర‌పైకొస్తాయోన‌న్న టాపిక్ హీట్ పెంచుతోంది.