Begin typing your search above and press return to search.

టాలీవుడ్ దెబ్బ‌కి బాలీవుడ్ షేకైపోతుందా?

By:  Tupaki Desk   |   24 Jan 2022 1:32 PM GMT
టాలీవుడ్ దెబ్బ‌కి బాలీవుడ్ షేకైపోతుందా?
X
టాలీవుడ్ అంటే ఇప్పుడు పాన్ ఇండియా..పాన్ వ‌ర‌ల్డ్ ..అంత‌కు మించి రీచ్ అవుతోన్న సంద‌ర్భం. బాహుబ‌లి స‌క్సెస్ తో తెలుగు సినిమా ఖ్యాతి విశ్వ‌వ్యాప్త‌మ‌వ్వ‌డంతో టాలీవుడ్ సినిమా అంటే వ‌ర‌ల్డ్ వైడ్ ప్ర‌త్యేక‌మై గుర్తింపు ద‌క్కుతోంది. విదేశృ న‌టుల్ని..సాంకేతిక నిపుణుల్ని సైతం దిగుమ‌తి చేసే స్థాయికి టాలీవుడ్ ఎదిగింది. ఇక నిర్మాణ ప‌రంగాను టాలీవుడ్..బాలీవుడ్ చిత్రాల్ని మించిపోయింది. ఇటీవ‌లే `పుష్ప` ది రైజ్ స‌క్సెస్ మ‌రోసారి పాన్ ఇండియాలో వెలిగిపోయింది. నార్త్ లో ఎలంటి అంచాలు లేకుండా విడుద‌లై సంచ‌ల‌న విజయాన్ని అందుకుంది. హందీలో పుష్ప వ‌సూళ్లు చూసి ఉత్త‌రాది వాళ్లే సాక్ అవుతున్నారు.

ఇలాంటి లైన‌ప్స్ మ‌రిన్ని ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. `ఆర్ ఆర్ ఆర్`..`రాధేశ్యామ్`..`కేజీఎఫ్-2`..`స‌లార్`..`పుష్ప‌-2` చిత్రాలు పాన్ ఇండియ కేట‌గిరిలో రిలీజ్ కాబోతున్న సంగ‌తి తెలిసిందే. మ‌రి ఈ సినిమా రిలీజ్ ల‌తో బాలీవుడ్ చిత్రా రిలీజ్ లు సైతం వెనక్కి త‌గ్గుతున్నాయా? అంటే అవున‌నే టాక్ వినిపిస్తోంది. కోవిడ్ కార‌ణంగా పై చిత్రాలు వాయిదా ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. థ‌ర్డ్ వేవ్ అనంత‌రం ఈ చిత్రాల‌న్ని ఒక్కోక్క‌టిగా రిలీజ్ చేయ‌డానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ముందుగా ఆర్ ఆర్ ఆర్ చిత్రం స‌మ్మ‌ర్ కానుక‌గా రిలీజ్ కు స‌న్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఉత్త‌రాదిన పెద్ద ఎత్తున ప్ర‌మోట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

అక్క‌డ భారీ ఎత్తున రిలీజ్ కి అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ త‌ర్వాత గ్యాప్ ఎక్కువ ఉండేలా చూసుకుని త‌మ చిత్రాల్ని రిలీజ్ చేసుకోవాల‌ని బాలీవుడ్ నిర్మాణ సంస్థ‌లు భావిస్తున్నాయ‌ట‌. ఈ స‌న్నివేశం చూస్తుంటే మళ్లీ పాత రోజులు వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. అప్ప‌ట్లో హిందీ సినిమాల్ని తెలుగు అనువాద‌మ‌య్యేవి. ఆ చిత్రాల‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ ఉండేది. అప్ప‌టికే ఆ సినిమాలు హిందీ లో హిట్ టాక్ తెచ్చుకుని రిలీజ్ అవ్వ‌డంతో తెలుగు ప్రేక్ష‌కులు డ‌బ్బింగ్ చిత్రాల కోసం ఎగ‌బ‌డేవారు. ఇప్పుడు తెలుగు సినిమాల కోసం ఉత్త‌రాది ప్రేక్ష‌కులు ఎంతో ఎగ్జైట్ మెంట్ ఎదురుచూడ‌టం విశేషం.