టాప్ స్టోరి: పిలక ముడితో ఫికరేంది హీరోలూ?

Fri Sep 25 2020 13:00:51 GMT+0530 (IST)

Tollywood Top Heroes New Pilaka hair Style Goes Viral In Social Media

పిలకముడి ట్రెండ్ ఇప్పటిది కాదు. చాలా కాలం క్రితం రామ్ చరణ్ మగధీర చిత్రంలో పిలకముడితో కనిపించాడు. బన్ని బద్రీనాథ్ సహా పలు చిత్రాల్లో పిలకముడితో కనిపిస్తే `అదుర్స్`లో బ్రాహ్మణుడిగా నటించిన ఎన్టీఆర్ కూడా పిలకముడితో ట్రీటిచ్చారు. ఇక సీనియర్లలో చిరంజీవి .. నాగార్జున.. వెంకటేష్ తమ సినిమాల్లో పిలకముడి ట్రీట్ ఇచ్చిన సంగతిని మరువలేరు అభిమానులు.ఇటీవల మళ్లీ ఇండస్ట్రీలోకి పిలక ట్రెండ్ వచ్చి చేరింది. నాగశౌర్య తన అప్ కమింగ్ సినిమాలో పిలక ముడి వేస్తున్నాడు. అతడు భారీగా కండలు పెంచాడు. 6 ప్యాకింగులు చూపిస్తున్నాడు. విజయ్ దేవరకొండ కూడా జుట్టుకి రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని తిరుగుతున్నాడు..! పూరీ సినిమాలో ఈ లుక్ ఉండొచ్చు అంటున్నారు. విజయ్- పూరి `ఫైటర్` కోసం చాలా సాహసాలే చేస్తున్నారు. హైదారబాద్ లో సెట్ వేసి ఈ సినిమాని తెరకెక్కించనున్నారని కథనాలొచ్చాయి.

అలానే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా పిలక లుక్ లో కనిపించవచ్చు అంటున్నారు. వరుణ్ వరుసగా పలువురు దర్శకులకు కమిట్ మెంట్లు ఇచ్చి షెడ్యూలింగ్ చేస్తున్నారు.  దీంతో పాటు ఈ మధ్యనే కుర్ర హీరో కార్తికేయ కూడా పిలక వేసుకొని 90 ఎమ్ ఎల్ లో కనిపించాడు.

రామ్ చరణ్- అల్లు అర్జున్- యన్టీఆర్ వంటి స్టార్ హీరోలు పిలక ఫ్యాషన్ ని ఉపయోగించి వదిలేసాక నవతరం వారిని అనుసరించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పుడు మళ్లీ పిలకల ట్రెండ్ నడుస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు..! స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా అంటే పిలక ఉండాల్సిందే అని మన కుర్ర హీరోలు ఫీల్ అవుతున్నారా? అన్నదానికి వాళ్లే స్వయంగా సమాధానం చెబితే బావుంటుందేమో!