కొత్తగా కనిపించేందుకు కష్టపడుతున్న టాలీవుడ్ స్టార్స్

Fri Mar 31 2023 19:00:01 GMT+0530 (India Standard Time)

Tollywood Stars Trying For New Looks

సినిమా ఇండస్ట్రీ అనేది గ్లామర్ ప్రపంచం. ఎప్పుడూ ఒకేలా కనిపిస్తే ఒకరోజు కాకున్నా ఇంకొక రోజు... ఇంకొక రోజు కాకున్నా ఆ తర్వాత రోజు అయినా ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. అందుకే హీరోలు హీరోయిన్స్ ఇతర నటీనటులు ఎప్పుడూ ఒకేలా కాకుండా విభిన్నంగా కనిపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో భాగంగానే సిక్స్ ప్యాక్.. ఎయిట్ ప్యాక్ బాడీస్ అనే విషయం తెల్సిందే.కొత్తగా కనిపించడం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు సక్సెస్ దక్కించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయని పలు సందర్భాల్లో నిరూపితమైంది. తాజాగా మరోసారి పలువురు యంగ్ హీరోలు.. సీనియర్ హీరోలు కూడా కొత్త లుక్ ప్రయత్నించేందుకు సిద్ధమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రంలో రెగ్యులర్ గా కంటే కాస్త విభిన్నంగా కనిపించి సక్సెస్ దక్కించుకున్న విషయం తెలిసిందే.

ఇక బాలకృష్ణ.. నాగార్జున కూడా ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో వయస్సు తో సంబంధం లేకుండా విభిన్నంగా కనిపించి ప్రేక్షకులను అలరించాలని భావిస్తున్నారు. ఆ కారణంగానే విభిన్నమైన గెటప్స్ లో కనిపించనున్నారట. వీరు మాత్రమే కాకుండా యంగ్ హీరోలు కూడా చాలా మంది విభిన్నంగా కనిపించడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.

పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ ఎంతగా మారాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక విజయ్ దేవరకొండ లైగర్ సినిమా కోసం తన లుక్ ని మార్చేశాడు. ఇటీవల విడుదలైన దసరా చిత్రంలో నాని కూడా మునుపెన్నడు కనిపించన విధంగా కనిపించాడు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో రామ్ చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. అందులో తండ్రి పాత్ర లో భాగంగా కాస్త వయసు ఎక్కువ వ్యక్తిగా కనిపించబోతున్నాడు.

ఇలా యంగ్ స్టార్ హీరోలు సీనియర్ స్టార్ హీరోలు ఎంతో మంది కొత్తగా కనిపించి సక్సెస్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా వారు ఏ మేరకు సక్సెస్ అవుతారు అనేది చూడాలి.

ఇప్పటికే కొత్తగా ప్రయత్నించిన వారు.. న్యూ లుక్ తో వచ్చిన వారు ఎక్కువ శాతం సక్సెస్ అయిన దాఖలాలు ఉన్నాయి. కనుక ప్రస్తుతం కొత్తగా ప్రయత్నిస్తున్న వారు కూడా సక్సెస్ ని దక్కించుకుంటారని వారి వారి అభిమానులు భావిస్తున్నారు. కొత్త లుక్ తో వచ్చిన వారు సక్సెస్ అయితే ముందు ముందు మరిన్ని విభిన్నమైన లుక్స్ తో హీరోలు వచ్చే అవకాశాలున్నాయి.      


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.