Begin typing your search above and press return to search.

తీవ్రంగా నిరాశ‌ప‌రిచిన సంక్రాంతి స్టార్లు?

By:  Tupaki Desk   |   14 Jan 2022 8:55 AM GMT
తీవ్రంగా నిరాశ‌ప‌రిచిన సంక్రాంతి స్టార్లు?
X
సెకండ్ వేవ్ త‌ర్వాత అగ్ర హీరోలు న‌టించిన‌ క్రేజీ సినిమా ఏదీ విడుద‌ల కాలేదు. క‌రోనా ప్ర‌భావం త‌గ్గడంతో ఈ రెండు నెల‌ల్లో విడుద‌ల‌కు భారీ చిత్రాలు రెడీ అయ్యాయి. ఎన్బీకే- బ‌న్ని-నాని- ప‌వ‌న్ క‌ల్యాణ్‌- ప్ర‌భాస్ చిత్రాలు రేసులో ఉన్నాయ‌న్న ప్ర‌చారం తో డిసెంబ‌ర్ అంత‌టా ప్రేక్ష‌క మ‌హాశ‌యుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ముఖ్యంగా ఆయా హీరోల అభిమానులు సంక్రాంతి క‌ల‌లు కంటూ ఎన్నో లెక్క‌లు వేశారు.

తీరా సంక్రాంతి ముందు పెద్ద హీరోలు కొట్టిన దెబ్బ‌కు ఫ్యాన్స్ ఇప్పుడు తీవ్ర నిరాశ‌లో కూరుకుపోయారు. ప్ర‌తిష్ఠాత్మ‌క ఆర్.ఆర్.ఆర్ సంక్రాంతి రేసులోనే వ‌స్తోంద‌ని ప్ర‌చారం కావ‌డంతో చ‌ర‌ణ్ - తార‌క్ ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకున్నారు. కానీ వీళ్ల‌కు తీవ్ర నిరాశ త‌ప్ప‌లేదు. ఈసారి సంక్రాంతి థియేట‌ర్ల వ‌ద్ద ఏమంత సంద‌డి క‌నిపించ‌లేద‌ని ట్రేడ్ చెబుతోంది. ఈరోజు భోగి.. అయినా కానీ థియేట‌ర్ల వ‌ద్ద జ‌నం గుమికూడ‌లేద‌ని రిపోర్ట్. కింగ్ నాగార్జున‌- నాగ‌చైత‌న్య న‌టించిన బంగార్రాజు థియేట‌ర్లు మిన‌హా దూకుడు క‌నిపించ‌డం లేదు ఇప్ప‌టివ‌ర‌కూ అని చెబుతున్నారు.

ప్ర‌భాస్ - చ‌ర‌ణ్ - తార‌క్- ప‌వ‌న్ - రానా వంటి టాప్ స్టార్ల సినిమాలు రేసు నుంచి వైదొల‌గ‌డంతో సంక్రాంతి చ‌ప్ప‌గానే సాగుతోంది. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెర‌కెక్కించిన‌ RRR జనవరి 7న అన్ని భాషల్లో రికార్డు స్థాయిలో విడుదల కానుందన్న ప్ర‌చారం అంతా వృధా అయింది. అలాగే పవన్ కళ్యాణ్ -రానా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న `భీమ్లా నాయక్` జనవరి 12న విడుదల కావాల్సి ఉండగా చివ‌రి నిమిషంలో ప్లాన్ ఛేంజ్ తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్ కోసం అవ‌కాశం క‌ల్పించాల‌ని వెన‌క్కి త‌గ్గ‌డంతో ప‌వ‌న్ - రానా ఫ్యాన్స్ తీవ్ర నిరాశ‌ప‌డ్డారు.

ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ప‌రంగా 100 కోట్ల మేర బిజినెస్ సాగింది. పెద్ద హోప్ తో సంక్రాంతికి ప‌వ‌న్ స‌త్తా చాటుతాడ‌ని భావించినా కానీ వాయిదా నిరాశ‌ప‌రిచింది. ప్రభాస్ తదుపరి పాన్-ఇండియన్ ప్రయత్నం `రాధే శ్యామ్` జనవరి 12న విడుదలవుతోందని క‌న్ఫామ్ గా డేట్ వేసి మ‌రీ వెన‌క్కి త‌గ్గారు. థియేట్రికల్ హక్కులు రూ. 200 కోట్లకు పైగా అమ్ముడయ్యాయి. వంద కోట్లు అంత‌కుమించిన బిజినెస్ చేసిన ఈ సినిమాలు భారీ వ‌సూళ్ల‌ను తేవాల్సి ఉండ‌గా ఈ వాయిదాతో ఇప్పుడు ఫ్యాన్స్ నిరాశ మాత్ర‌మే కాదు బిజినెస్ వ‌ర్గాల్లోనూ ర‌క‌ర‌కాల చ‌ర్చ సాగుతోంది.

ఏదేమైనా సంక్రాంతి బ‌రిలో వ‌స్తాయ‌నుకున్న‌వి రాక‌పోవ‌డంతో పాన్ ఇండియా స్టార్ల అభిమానులు తీవ్ర నిరాశ‌లో కూరుకుపోయారు. అయితే వీరంద‌రినీ సంతృప్తి ప‌ర‌చాలంటే క‌నీసం వీటి రిలీజ్ తేదీల్ని అయినా ప్ర‌క‌టిస్తార‌ని భావిస్తున్నారు. కానీ ఇంత‌వ‌ర‌కూ ఎలాంటి స‌మాచారం లేదు. ఇక‌పోతే ఈ సంక్రాంతి బ‌రిలో ఇద్ద‌రు డెబ్యూ హీరోల సినిమాలు వ‌చ్చాయి. అలాగే నాగ్ - చై బంగార్రాజు ఆదుకుంటుంద‌న్న హోప్ ఉంది. మ‌రి కాసేప‌ట్లో వీటికి సంబంధించి తుపాకి రివ్యూలు అందుబాటులోకి రానున్నాయి.

బ‌న్ని - బాల‌య్యే బెస్ట్ అనిపించారు!

సంక్రాంతి ముందు వ‌చ్చిన బాల‌య్య - బ‌న్ని ది బెస్ట్ అనిపించారు. డిసెంబర్ 2న విడుదలైన‌ అఖండ‌ బాల‌య్య‌-బోయ‌పాటి బృందానికి హ్యాట్రిక్ హిట్ గా నిలిచి వారి ఫ్యాన్స్ కి ఆనందం తెచ్చింది. అఖండ రిలీజ్ త‌ర్వాత మ‌రో పెద్ద చిత్రం పుష్ప‌.. అల్లు అర్జున్ న‌టించిన పుష్ప‌ డిసెంబర్ 17న విడుద‌లై నిరాశ‌ప‌ర‌చ‌లేదు. బ‌న్ని కెరీర్ బెస్ట్ హిట్ గా నిలిచింది.. ఈ చిత్రం బ‌న్నీకి పాన్-ఇండియన్ అరంగేట్ర చిత్రంగా పేరు తెచ్చింది. ఇది కూడా అల్లు అర్జున్ - సుకుమార్ ల‌కు హ్యాట్రిక్ మూవీ... ఈ మూవీకి ఇటు తెలుగు రాష్ట్రాలు స‌హా అటు మ‌ల‌యాళం హిందీలోనూ క్రేజుకు త‌గ్గ‌ట్టే వ‌సూళ్లు ద‌క్కాయి. దాదాపు 200కోట్ల మేర థియేట్రిక‌ల్ డీల్స్ కుదర‌గా 300 కోట్లు పైగా వ‌సూల్ చేసింది. హిందీ బెల్ట్ నుంచి 80కోట్లు వ‌సూలు చేసి స‌త్తా చాటింది. నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన‌ శ్యామ్ సింఘరాయ్ తన కెరీర్ లో అత్యంత ఖరీదైన చిత్రం కాగా చ‌క్క‌ని విజ‌యం అందుకుంది.