హిట్టు కొట్టెయ్...పెళ్లాడెయ్ బాస్!

Fri Feb 21 2020 10:15:19 GMT+0530 (IST)

Tollywood Small Heroes Wishing Nithin For Bheeshma Grand Success

ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిశ్రమల స్నేహసుహృద్భావ స్వభావం కనిపిస్తోంది. ఇటీవల పాత పంథాని వదిలి ఈగోలతో పని లేకుండా స్నేహాలు చేస్తున్నారు. ఒక హీరో ఆడియో ఫంక్షన్ కు మరో హీరో అతిథిగా హాజరవ్వడం సినిమాకు బూస్ట్ ఇవ్వడం వంటివి చేస్తున్నారు. సక్సెస్ వస్తే అభినందిస్తున్నారు. ఇక రిలీజ్ డే సందర్భంగా ఆల్ ది బెస్ట్ చెప్పే కల్చర్ యంగ్ హీరోల్లో కనిపిస్తోంది. స్టార్ హీరోల్లో మాత్రం ఆ రకమైన సంస్కృతి అప్పుడప్పుడు బయటపడుతుంటుంది. అయినా సీనియర్ల సంగతి ఎలా ఉన్నా యంగ్ హీరోలు మాత్రం ఒకరికొకరు ప్రమోషనల్ సాయానికి వస్తున్నారు. తాజాగా యూత్ స్టార్ నితిన్-రష్మిక మందన జంటగా నటించిన `భీష్మ` రిలీజ్ సందర్భం గా నితిన్ కు టాలీవుడ్ నుంచి పలువురు యంగ్ హీరోలు సినిమా సక్సెస్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్పారు.మెగా హీరో వరుణ్ తేజ్ ఈ శుక్రవారం నితిన్ కి కలిసి రావాలని కోరుకున్నాడు. అలాగే యంగ్ హీరోలు సాయితేజ్..కార్తికేయ గుమ్మడికొండ ష్యూర్ షాట్ విన్నర్ అంటూ ట్వీట్ చేసాడు. నితిన్ అభిమానులు ఈసారి హిట్టు కొట్టి పెళ్లాడాలని కోరుకున్నారు. అనంతరం నితిన్ వాళ్లందరికి కృతజ్ఞతలు తెలిపాడు.

అయితే ఈ సారి విషెస్ వెనుక చాలా విశేషమే ఉంది. భీష్మ సక్సెస్ నితిన్ కి అనివార్యమైనది. ఇటీవల కాలంలో యూత్ స్టార్ సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద సరిగ్గా రాణించడం లేదు. కాబట్టి హిట్టు తప్పని. అలాగే నితిన్ బ్యాచిలర్ షిప్ వదిలేసి ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఏప్రిల్ లో తాను ప్రేమించిన షాలిని తో వివాహం కానుంది. హిట్టు కొట్టి పాజిటివ్ వైబ్స్ మధ్య పెళ్లాడాలనుకుంటున్నాడు. అలా రెండు రకాలు గాను కలిసొచ్చేలా ``హిట్టు కొట్టు...పెళ్లాడు బాస్`` అన్నట్లుగా హీరోలు అభిమానుల బ్లెస్సింగ్  ఉందన్న మాట.