Begin typing your search above and press return to search.

ఆ నిర్మాతలు వారి సినిమాలు ప్లాప్ అని అంగీకరించినట్లేనా...!

By:  Tupaki Desk   |   5 April 2020 4:50 AM GMT
ఆ నిర్మాతలు వారి సినిమాలు ప్లాప్ అని అంగీకరించినట్లేనా...!
X
కరోనా వైరస్ వచ్చి ప్రపంచాన్ని గడగడ వణికిస్తోంది. మన దేశాన్ని కూడా కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ప్రజలెవరూ రోడ్ల మీదకు రాకూడదని, ఇంట్లోనే ఉండాలనే ప్రధాని ఆదేశాలను అందరూ పాటిస్తున్నారు. దీంతో రోజూవారి కూలీలు - దినసరి వేతనంపై ఆధారపడ్డవారి పరిస్థితి దిక్కుతోచని స్థితిలోకి వెళ్లింది. అయితే సినీ కార్మికులకు అండగా ఆయా సినీ పరిశ్రమలు ముందుకు వచ్చాయి. తెలుగు సినీ కార్మికులను ఆదుకునేందుకు చిరంజీవి కరోనా క్రైసిస్ ఛారిటీని స్థాపించి ముందుగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించి - మిగతా వారికి పిలుపునిచ్చాడు. చిరు పిలుపుతో సినీ హీరోల నుండి విరాళాలు వెల్లువలా వచ్చాయి. అక్కినేని నాగార్జున సీ.సీ.సీకి కోటి రూపాయలు విరాళం ప్రకటించి దీన్ని మరో స్టెప్ ముందుకు తీసుకెళ్లాడు. టాలీవుడ్ లోని చిన్న హీరో పెద్ద హీరో అని తేడా లేకుండా అందరు తమకు తోచిన విధంగా సహాయం చేస్తూ ఉన్నారు.

అయితే కరోనా పై యుద్ధానికి హీరోల నుండి మంచి స్పందనే వచ్చినా హీరోయిన్ల నుండి - నిర్మాణ సంస్థల నుండి పెద్దగా స్పందన రాలేదనే చెప్పవచ్చు. సినీ ఇండస్ట్రీ మీద బ్రతుకుతూ సినీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం స్పందించకపోవడంతో సోషల్ మీడియా వేదికగా వీళ్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అంతేకాకుండా ఇప్పటి దాకా రిలీజై హిట్టు కొట్టిన - బ్లాక్ బస్టర్స్ సాధించిన ప్రతీ సినిమా నిర్మాతలందరూ కచ్చితంగా కరోనా క్రైసిస్ ఛారిటీకి విరాళం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. విరాళాలు ఇవ్వకపోతే ఇండైరెక్టుగా వారు నష్టాల్లో ఉన్నట్లు ఒప్పుకున్నట్లే అని - సినిమా ప్లాప్ అయినా హిట్ అని ప్రచారం చేసుకున్నట్లే అని సోషల్ మీడియా వేదికగా సినీ అభిమానులు ప్రకటిస్తున్నారు. మరి ఇప్పటికైనా స్పందించి కష్టాల్లో ఉన్న సినీ కార్మికులను ఆదుకోడానికి ముందుకు వస్తారేమో చూడాలి.