Begin typing your search above and press return to search.

కోలీవుడ్ లో టాలీవుడ్ విల‌న్ల హ‌వా

By:  Tupaki Desk   |   26 Sep 2021 4:30 AM GMT
కోలీవుడ్ లో టాలీవుడ్ విల‌న్ల హ‌వా
X
కోలీవుడ్ లో టాలీవుడ్ విల‌నిజం ఈనాటిది కాదు. టాలీవుడ్ ఆరంభం మ‌న‌కు హీరోలే లేరు. తొలుత త‌మిళంలో విల‌న్లుగా ప‌రిచ‌య‌మై అటుపై హీరోలు అయ్యి స్టార్ హీరోలుగా ఎదిగిన‌వారెంద‌రో. హీరో అనే వేదిక ఒకేసారి రాక‌పోవ‌డంతో విల‌న్ గా ఎంట్రీ ఇచ్చి అటుపై టైమ్ క‌లిసొచ్చి హీరోలుగా ట‌ర్న్ అయిన వారు చాలా మంది ఉన్నారు. కెరీర్ ఆరంభంలో మెగాస్టార్ చిరంజీవి ఓ కోలీవుడ్ చిత్రంలో విల‌న్ గా న‌టించిన‌వారే. 1981 లో తెర‌కెక్కిన `ర‌ణువ వీర‌న్` అనే సినిమాలో చిరంజీవి విల‌న్ పాత్ర పోషించారు. ఇందులో ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టించారు. ఇందులో చిరంజీవి-ర‌జ‌నీకాంత్ పోటాపోటీగా న‌టించారు. ఇక ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన జ‌గ‌ప‌తిబాబు ఇప్పుడు విల‌న్ గా మారిన సంగ‌తి తెలిసిందే.

`లెజెండ్` సినిమాతో ఆయ‌న విల‌న్ అవ‌తారం ఎత్తారు. ఈ సినిమాతో ప్ర‌తినాయ‌కుడిగ‌తా మంచి పేరొచ్చింది. ఆ త‌ర్వాత కోలీవుడ్ చిత్రాల్లోనూ విల‌న్ గా ఆఫ‌ర్లు విరివిగా అందుకున్నారు. `లింగా`..`భైర‌వ‌`..`విశ్వాసం` లాంటి కోలీవుడ్ చిత్రాల్లో జ‌గ‌ప‌తి బాబు విల‌న్ గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇంకా మ‌ల‌యాళం..క‌న్న‌డ భాష‌ల్లోనూ ఈ ఫ్యామిలీ స్టార్ విల‌న్ ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. ఇక `అందాల రాక్ష‌సి` సినిమాతో రొమాంటిక్ హీరోగా ప‌రిచ‌య‌మైన న‌వీన్ చంద్ర అటుపై విల‌న్ గా ట‌ర్న్ తీసుకున్నారు. హీరోగా స‌క్సెస్ కాక‌పోయిన్ విల‌న్ గా స‌క్సెస్ అయ్యారు. ఆ ఐడెంటీతో కోలీవుడ్ లో ప్ర‌తినాయ‌కుడి పాత్ర అవ‌కాశాలు బాగానే వ‌స్తున్నాయి.

ధ‌నుష్ హీరోగా న‌టించిన `ప‌టాస్` చిత్రంలో న‌వీన్ విల‌న్ గా న‌టించి మంచి పేరు సంపాదించాడు. అలాగే మ్యాచ్ స్టార్ గోపీచంద్ కూడా ముందుగా విల‌న్ పాత్ర‌తో ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. తెలుగుతో పాటు త‌మిళ్ లో `జ‌యం` చిత్రంలో విల‌న్ గా అత‌నే న‌టించాడు. `వ‌ర్షం`..`నిజం` లాంటి చిత్రాల్లో గోపీచంద్ విల‌న్ గా మెప్పించిన సంగ‌తి తెలిసిందే. ఇక `ఆర్ ఎక్స్ -100` చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ కు కోలీవుడ్ లో విల‌న్ గా మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. నాని `గ్యాంగ్ లీడ‌ర్` లో విల‌న్ గా న‌టించిన కార్తికేయ ఇప్పుడు త‌ళ అజిత్ హీరోగా న‌టిస్తోన్న `వాలిమై` లో విల‌న్ గా న‌టిస్తున్నాడు.