Begin typing your search above and press return to search.

టాలీవుడ్ హయ్యెస్ట్ గ్రాస్ సినిమాలు.. లెక్క మారింది

By:  Tupaki Desk   |   7 Feb 2023 1:00 PM GMT
టాలీవుడ్ హయ్యెస్ట్ గ్రాస్ సినిమాలు.. లెక్క మారింది
X
ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంది. ముఖ్యంగా స్టార్ హీరోలు అందరూ యూనివర్సల్ కథలతో పాన్ ఇండియా స్థాయిలో తమ బ్రాండ్ వేల్యూని ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం కొందరు చేస్తూ ఉండగా, మరికొందరు ఉన్న మార్కెట్ ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇండియన్ వైజ్ గా తెలుగు సినిమాపై ప్రేక్షకుల అభిరుచి పెరగడంతో ఇది తమ సినిమాలకి అనుకూలంగా మారిందని స్టార్ హీరోలు భావిస్తున్నారు.

ముఖ్యంగా నార్త్ లో బాలీవుడ్ తర్వాత ఆ స్థాయిలో ఇమేజ్ ఉన్నదీ తెలుగు హీరోలకే. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో ఇప్పటి వరకు హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రాల జాబితా చూసుకుంటే టాప్ 10లో మన స్టార్స్ మాత్రమే ఉండటం విశేషం.

ఇక హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రాల జాబితాలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి 2 మొదటి స్థానంలో ఉండగా, ఆర్ఆర్ఆర్ రెండో స్థానంలో ఉంది. తరువాత మరల బాహుబలి సినిమా నిలిచింది. ఇక నాలుగో స్థానంలో ప్రభాస్ సాహో మూవీ నిలవడం విశేషం.

ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న సాహో హైయెస్ట్ కలెక్షన్స్ ని బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ కి అందించింది. ఇక ఐదో స్థానంలో పుష్ప, ఆరో స్థానంలో అల వైకుంఠపురంలో మూవీ నిలిచింది.

ఈ సినిమా కేవలం తెలుగులోనే రిలీజ్ అయినా కూడా భారీ కలెక్షన్స్ ని రాబట్టడం విశేషం. దీని తర్వాత చిరంజీవి సైరా నరసింహారెడ్డి ఏదో స్థానంలో ఉంది. ఎనిమిదో స్థానంలో చిరంజీవి వాల్తేర్ వీరయ్య మూవీ నిలించింది.

తొమ్మిదో స్థానంలో సర్కారు వారిపాట, 10వ స్థానంలో రంగస్థలం సినిమా నిలిచింది. వీరిలో ప్రభాస్ 30 సార్లు హైయెస్ట్ గ్రాస్ హీరోగా నిలబడగా తర్వాత మెగా హీరోలైన అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి రెండు సార్లు హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన హీరోల జాబితాలో ఉన్నారు. ఆ తరువాత మహేష్ బాబు, తారక్ ఒకసారి నిలిచారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.