పవన్.. చరణ్.. ఎన్టీఆర్.. మహేష్.. ఇప్పుడు అందరూ చిల్ మూడ్

Sat Apr 01 2023 14:03:45 GMT+0530 (India Standard Time)

Tollywood Heros in Summer Vacations

టాలీవుడ్ స్టార్ హీరోల్లో చాలా మంది వేసవి ఆరంభం అవ్వడమే ఆలస్యం సమ్మర్ హాలీడే ట్రిప్ అంటూ విదేశాలకు వెళ్తున్నారు. వారం నుండి రెండు మూడు వారాలు నెల రోజుల పాటు కూడా కొందరు సెలబ్రెటీలు ఈ సమ్మర్ హాలీడేస్ ను విదేశాల్లో ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే పలువురు స్టార్స్ మరియు సెలబ్రెటీలు విదేశాలకు చెక్కేశారు.పవన్ కళ్యాణ్ ఇటీవలే విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లాడు అనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు అధికారికంగా క్లారిటీ రాలేదు కానీ ఫ్యామిలీతో కలిసి పవన్ కళ్యాణ్ విదేశాల్లో ప్రస్తుతం సేద తీరుతున్నాడు. ఏప్రిల్ రెండవ వారంలో పవన్ కళ్యాణ్ షూటింగ్ లో జాయిన్ అవ్వాల్సి ఉంది. కాస్త అటు ఇటుగా పవన్ షూటింగ్ లో అవ్వడం కోసం త్వరలోనే ఇండియాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఎన్టీఆర్ ఇటీవలే తన ఫ్యామిలీ మొత్తంతో కలిసి విదేశాలకు విమానం ఎక్కేశాడు. రెండు నుండి మూడు వారాల పాటు విదేశాల్లో హాలీడేస్ ను ఎన్టీఆర్ ఎంజాయ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

అయితే ఎన్టీఆర్ తన ఎన్టీఆర్ 30 సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ఈ నెలలో ప్రారంభించాల్సి ఉంది. కనుక రెండవ వారం లేదా మూడవ వారంకు ఇండియాకు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయట.

మహేష్ బాబు కూడా ఇటీవలే విదేశాలకు వెళ్లాడు అంటూ ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన మహేష్ బాబు త్వరలోనే తిరిగి ఇండియాకు వచ్చి ఆ సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. వచ్చే ఏడాది జనవరి లో సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

రామ్ చరణ్ కూడా తన భార్య ఉపాసనతో కలిసి విదేశాలకు చెక్కేశాడని తెలుస్తోంది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా యొక్క కీలక పాట చిత్రీకరణ ఇటీవలే ముగించిన చరణ్ వెంటనే విదేశాలకు వెళ్లాడని తెలుస్తోంది. ఇంకా కొందరు టాలీవుడ్ స్టార్స్ కూడా విదేశీ విహార యాత్రకు రెడీ అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.      


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.