చిరు 50.. రవితేజ 20.. మరి నాగ్ వెంకీ బాలయ్య?

Thu Jan 26 2023 23:00:01 GMT+0530 (India Standard Time)

Tollywood Heroes Remuneration

ఒక్క సినిమా హిట్టైటే ఆ మూవీ హీరో రేంజే వేరబ్బా. అతడి ముందు దర్శక నిర్మాతలు క్యూ కడుతుంటారు. రెమ్యునరేషన్ ఎంతైనా ఇచ్చి తమ సినిమాల్లో నటించేలా ప్రయత్నిస్తుంటారు. వారికి కళ్లు చెదిరే ఆఫర్లను ఇస్తుంటారు. ఇక విషయానికొస్తే.. ఈ పదేళ్లలో చాలా మంది టాలీవుడ్ హీరోల పారితోషికాలు పదింతలు పెరిగాయి. మన హీరోలు కంటెంట్ కథలతో పాటు రెమ్యునరేషన్ విషయంలోనూ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం తెలుగులో స్టార్లుగా వెలుగుతున్న చాలా మంది హీరోల పారితోషికం.. పదేళ్లు క్రితం ఎంత ఇప్పుడు ఎంత అని పోల్చుకుంటే ఆశ్చర్యపోక తప్పదు.ముఖ్యంగా బాహుబలితో తెలుగు సినిమా వరల్డ్ వైడ్ గా ఎదగడంతో టాలీవుడ్ రేంజే మారిపోయింది. తెలుగు సినిమాలను తెలుగు హీరోలను అందరూ ఆదరిస్తున్నారు. వారి చిత్రాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

దీంతో మన హీరోలందరూ పాన్ ఇండియా కంటెంట్ లను ఎంచుకుంటూ తమ రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు. దీంతో సినిమా బిజెనెస్ బాగా పెరిగిపోయింది. నాన్ థియేటర్ హక్కులు ఓవర్ సీస్ హక్కులు సినిమా బాగుంటే థియేటర్ల రెవెన్యూలు క్రమక్రమంగా పెరగడం.. ఇలా ఎన్నో అంశాలు కలిసి హీరోల పారితోషికాన్ని భారీగా పెంచేశాయి.

ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోల హవా నడుస్తుందనే చెప్పాలి. వారు కూడా పారితోషికాలను బాగా పెంచినట్లు తెలుస్తోంది. గాడ్ ఫాదర్ వీరయ్య సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి దాదాపు 50 కోట్ల వరకు వసూలు చేశారని బయట కథనాలు వస్తున్నాయి. ఇక రవితేజ అయితే వీరయ్యకు 18 కోట్లు తీసుకున్నారని టాక్. ఇకపై తన తర్వాతి చిత్రాలక 20కోట్లకు పైగా చార్జ్ చేయబోతున్నారని వినిపిస్తోంది.

బాలకృష్ణ రేంజ్ కూడా అఖండతో బాగా పెరిగిపోయింది. దీంతో ఆయన వీరసింహారెడ్డికి భారీ మొత్తంలోనే తీసుకున్నారని అన్నారు. ఇక అనిల్ రావిపూడి సినిమాకు 14 కోట్ల కు ఓకే చేశారని తెలిసింది.

ఎఫ్ 3 సినిమాతో నవ్వులు పూయించిన విక్టరీ వెంకటేశ్.. ఆ సినిమాకు ఎనిమిది కోట్లు తీసుకున్నారట. ఇప్పుడు లేటెస్ట్ సినిమాకు 12 కోట్లు చార్జ్ చేస్తున్నారని వినిపిస్తోంది. అయితే నాగార్జున పారితోషికంపై క్లారిటీ లేదు.

సీనియర్ హీరోల పరిస్థితి ఇలా ఉంట.. మీడియమ్ రేంజ్ హీరో నాని రూ.20 కోట్లు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం రూ. 25 కోట్లు అడుగుతున్నారని టాక్. కార్తికేయ 2 హిట్ అందుకున్న నిఖిల్ ఇకపై రూ. 7 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. ఇక నాగశౌర్య రూ.4 కోట్లు తీసుకుంటున్నారట. అసలు ఈ రెమ్యునరేషన్ విషయంలో నిజమెంతో తెలియదు కానీ ఈ వివరాలు మాత్రం కథనాలుగా ప్రచురితమవుతున్నాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.