Begin typing your search above and press return to search.

సంక్రాంతి స‌మ‌రానికి సై అంటున్నారు

By:  Tupaki Desk   |   2 July 2022 11:30 PM GMT
సంక్రాంతి స‌మ‌రానికి సై అంటున్నారు
X
సినిమాల‌కు ప్ర‌ధానంగా మూడు సీజ‌న్ లు. సంక్రాంతి, ద‌స‌రా, స‌మ్మ‌ర్‌.. ఈ మూడూ త‌ప్పితే దీపావ‌ళి. అయితే ముందు మాత్రం ప్ర‌తీ హీరో, డైరెక్ట‌ర్ క‌న్ను మాత్రం సంక్రాంతి సీజ‌న్ మీదే వుంటుంది. ఈ సీజ‌న్ లో త‌మ సినిమాని రిలీజ్ చేయాల‌ని, సంక్రాంతి సెంటిమెంట్ గా హిట్ ని త‌న ఖాతాలో వేసుకోవాల‌ని చూడ‌ని హీరో లేరు. దీంతో సంక్రాంతి స‌మ‌రం ప్ర‌తీ సారి ర‌స‌వ‌త్త‌రంగా వుంటూ వ‌స్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి క‌రోరా థ‌ర్డ్ వేవ్ ఇబ్బందిక‌రంగా మార‌డంతో ఏ పెద్ద సినిమా కూడా సంక్రాంతి బ‌రిలో దిగ‌డానికి ఇబ్బందిప‌డ్డాయి.

అయితే ప్ర‌స్తుతం ప‌రిస్థితులన్నీ చ‌క్క‌బ‌డ‌టంతో వ‌చ్చే ఏడాది సంక్రాంతి ఫైల్ కి రెడీ అంటూ మెగాస్టార్ నుంచి వైష్ణ‌వ్ తేజ్ వ‌ర‌కు స‌మ‌రానికి సై అంటూ కాలుదువ్వుతున్నారు. సంక్రాంతి సీజ‌న్ కు మ‌రో ఆరు నెల‌లు వుండ‌గానే బుర్తుల్ని ఖాయం చేసుకుంటూ అప్పుడే పోటీప‌డుతున్నారు. ప్ర‌తీ సంక్రాంతికి చాలా వ‌ర‌కు పోటీలో నిల‌వాల‌ని హ‌డావిడి చేసినా ఫైన‌ల్ గా మాత్రం పోటీలో నిలుస్తున్న‌వి నాలుగే. ఇందులో స్టార్ హీరోల సినిమాలే ఎక్కువ‌. కొన్ని అనుకున్న స‌మ‌యానికి రిలీజ్ కాక‌పోతే ఆ గ్యాప్ ని చిన్న సినిమాలు ఫిల్ చేస్తుంటాయి.

2023 సంక్రాంతి బ‌రిలో నిలిచే సినిమాల మ‌ధ్య మాత్రం గట్టి పోటీ వుండేలా క‌నిపిస్తోంది. అప్ప‌టికి ఎన్ని లైన్ లో వుంటాయో తెలియ‌దు కానీ ప్ర‌స్తుతం అయితే సంక్రాంతి పోటీకి చాలా సినిమాలే రెడీ అవుతూ మేమూ వ‌చ్చేస్తున్నామంటూ హ‌డావిడి చేసేస్తున్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కైతే డేట్ లు క‌న్ఫ‌మ్ చేసిన‌వి అయితే కేవ‌లం నాలుగు సినిమాలే వున్నాయి. అందులో మెగాస్టార్ న‌టిస్తున్న 154వ చిత్రం ఒక‌టి. ప్ర‌భాస్ హీరోగా న‌టించిన 'ఆది పురుష్‌' మ‌రొక‌ట‌. వీటితో పాటు విజ‌య్ వార‌సుడు తో పాటు పంజా వైష్ణ‌వ్ తేజ్ న‌టిస్తున్న కొత్త సినిమా.. ఇలా ఈ నాలుగు సినిమాలు సంక్రాంతికి బెర్త్ లు ఖ‌రారు చేసుకున్నాయి.

ఈ రేసులో రామ్ చ‌ర‌ణ్ - శంక‌ర్ ల సినిమా కూడా నిల‌వాల‌ని ప్ర‌య‌త్నించింది. దిల్ రాజు సంక్రాంతికే వ‌చ్చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు కూడా. కానీ షూటింగ్ ఆల‌స్యం అవుతుండ‌టం.. అదే స‌మ‌యంలో చిరు 154 మూవీ సంక్రాంతి బ‌రిలో నిల‌వ‌డంతో చ‌ర‌ణ్ సంక్రాంతికి రావాల‌న్న ఆలోచ‌న‌ని మార్చుకున్నార‌ట‌. చిరు - బాబిల కాంబినేష‌న్ లో ఓ బారీ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. 'వాల్తేరు వీర‌య్య‌' అనే టైటిల్ ని ఈ మూవీకి ఫైన‌ల్ గా ప‌రిశీలిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతికి బ‌రిలో తిగుతున్న‌ట్టుగా మేక‌ర్స్ రీసెంట్ గా ప్ర‌క‌టించారు.

ఇక ఇదే బాట‌లో ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టిస్తున్న బైలింగ్వ‌ల్ మూవీ 'వార‌సుడు' కూడా సంక్రాంతికే వ‌చ్చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించేసింది. పంజా వైష్ణ‌వ్ తేజ్ వీరితోపాటే కొత్త ద‌ర్శ‌కుడిగా హై వొఓల్టేజ్ మాస్ మ‌సాలా మూవీతో సంక్రాంతి రేస్ కు రెడీ అవుతున్నాడు. ప్ర‌భాస్ తొలి మైథ‌లాజిక‌ల్ మూవీతోనే 2023 సంక్రాంతి స‌మ‌రం స్టార్ట్ కాబోతోంది. ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముంద‌కు రాబోతోంది. భారీ చిత్రాల‌లో ఏది వెన‌క్కి త‌గ్గినా చిన్న సినిమాలు మాత్రం సంద‌డికి రెడీ అంటూ మ‌ధ్య‌లో దూర‌డానికి రెడీ అవుతున్నాయి.