టాప్ స్టోరి: తరాలు ఏల్తున్న జాక్ పాట్ క్వీన్స్

Wed Oct 14 2020 14:20:47 GMT+0530 (IST)

Tollwyood Jackpot Queens

టాలీవుడ్ లో హీరోయిన్ ల లైఫ్ స్పాన్ చాలా తక్కువ. మహా అంటే పదేళ్లు అంతే .. ఆ తరువాత కనిపించారంటే అది వాళ్లు దక్కించుకున్న గుర్తింపు క్రేజ్ కమ్యూనికేషన్ వల్లనే. అలా క్రేజ్ ని దక్కించుకుని రెండు తరాల హీరోలతో నటించిన వారు చాలా తక్కువ మందే వున్నారు. శ్రీదేవి- జయసుధ తరహాలో రెండు జనరేషన్ల స్టార్స్ తో కలిసి ఆడిపాడిన తారల్లో వీరిది ప్రత్యేక స్థానం.ఆ వరుసలో ముందున్న భామ కాజల్ అగర్వాల్. `లక్ష్మీ కల్యాణం`తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ చందమామ మెగా ఫ్యామిలీలో అందరు హీరోలతో నటించి రికార్డు సృష్టించింది. రామ్ చరణ్ తో మగధీర.. నాయక్.... గోవిందుడు అందరివాడేలే....  మెగాస్టార్ తో ఖైదీ నం.150 ప్రస్తుతం `ఆచార్య`లో నటిస్తోంది. ఇక పవన్‌కల్యాణ్‌తో `సర్దార్ గబ్బర్ సింగ్` బన్నీతో ఆర్య 2లో నటించి ఔరా అనిపించింది. తమన్నా కూడా తక్కువేం కాదండోయ్ మెగాస్టార్ తో `సైరా నరసింహారెడ్డి`... రామ్ చరణ్ తో `రచ్చ` ... బన్నీతో `బద్రీనాథ్ పవన్ కల్యాణ్ తో `కెమెరామెన్ గంగతో రాంబాబు` చిత్రాల్లో నటించి రెండు తరాల మెగా హీరోలని చుట్టేసింది.

వీరి తరువాత అరుదైన ఘనతని సాధించిన హీరోయిన్ త్రిష. నందమూరి ఫ్యామిలీకి చెందిన రెండు తరాల హీరోలు బాలకృష్ణతో `లయన్` .... యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో `దమ్ము` చిత్రాల్లో నటించింది. ఇక మెగా ఫ్యామిలీ హీరోలైన చిరంజీవితో `స్టాలిన్` పవన్‌కల్యాణ్‌తో `బంగారం` తీన్ మార్ చిత్రాల్లో నటించి రెండు ఫ్యామిలీల రెండు తరాల హీరోలతో నటించిన ఘనతని సొంతం చేసుకుంది. ఆర్తీ అగర్వాల్ కూడా నందమూరి రెండు తరాల హీరోలతో నటించింది. ఎన్టీఆర్ తో `అల్లరి రాముడు`.... బాలకృష్ణతో `పల్నాటి బ్రహ్మనాయుడు` చిత్రాల్లో ఆకట్టుకుంది. నయనతార దగ్గుబాటి... నందమూరి ఫ్యామిలీ హీరోలతో సినిమాలు చేసింది. పవన్ కల్యాణ్.... బన్నీ... రామ్ చరణ్ లతో సమంత సినిమాలు చేసింది. శృతిహాసన్ కూడా మెగా హీరోలు పవన్‌కల్యాణ్.... బన్నీ.... రామ్ చరణ్ లతో సినిమాలు చేసి ఆకట్టుకుంది. వీళ్ల తరహాలోనే రెండు ఫ్యామిలీలకు చెందిన రెండు తరాల హీరోలతో కలిసి ఆడిపాడిన వారిలో జెనీలియా... చార్మి.... శ్రియ... ఇలియానా వున్నారు.