Begin typing your search above and press return to search.

2023 లో బిగ్గెస్ట్ లాస్ మూవీస్ ఇవే

By:  Tupaki Desk   |   6 Jun 2023 6:00 PM GMT
2023 లో బిగ్గెస్ట్ లాస్ మూవీస్ ఇవే
X
టాలీవుడ్‌లో సంక్రాంతి సీజన్‌ను సినిమాల సీజన్ అని పిలుచుకుంటూ ఉంటారు. అప్పుడు వరుసగా మూడు నాలుగు రోజులు పండుగ సెలవులు ఉండడం వల్ల భారీ చిత్రాలను విడుదల చేస్తుంటారు. దీని తర్వాత మళ్లీ సమ్మర్‌లోనే ఎక్కువగా సినిమాలు వస్తుంటారు. అయితే, ప్రతి ఏడాదిలా ఈ సారి వేసవి టాలీవుడ్‌కు కలిసి రాలేదు. ఈ సీజన్‌లో వచ్చినవి చాలా ఫ్లాప్ అయ్యాయి.

2023 సంవత్సరానికి సంబంధించి సమ్మర్ చాలా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో కొన్ని మాత్రం భారీ నష్టాలను చవి చూసి బిగ్గెస్ట్ డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా 'శాకుంతలం'. సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏకంగా రూ. 50 కోట్లు నష్టాలతో పెద్ద డిజాస్టర్ ఫిల్మ్‌గా మిగిలింది.

'శాకుంతలం' తర్వాత ఈ వేసవిలో భారీ బడ్జెట్‌తో విడుదలైన సినిమానే 'ఏజెంట్'. అక్కినేని అఖిల్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం కూడా దారుణమైన ఫలితాన్ని చవి చూసింది. ఫలితంగా నిర్మాతలకు ఏకంగా రూ. 33 కోట్లు వరకూ నష్టాలు వచ్చాయి. దీంతో అఖిల్ కెరీర్‌లోనే అత్యధిక లాస్‌ను తెచ్చిన సినిమాగా ఇది చెత్త రికార్డును కూడా నమోదు చేసుకుంది.

ఇక, ఈ ఏడాది సమ్మర్‌లో విడుదలై భారీ నష్టాలను ఎదుర్కొన్న చిత్రాల్లో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన 'కస్టడీ' కూడా ఉంది. ఈ సినిమా కూడా ప్రేక్షకుల మన్ననలు పొందలేకపోయింది. ఫలితంగా రూ. 18 కోట్లు వరకూ నష్టాలను చవి చూసింది. అయితే, 'కస్టడీ' వల్ల నిర్మాతలకు మంచి బిజినెస్ జరిగింది. కానీ, డిస్ట్రిబ్యూటర్లు మాత్రం బాగా లాస్ అయ్యారు.

ఇవి మాత్రమే కాదు..ఈ సంవత్సరం వేసవిలో విడుదలైన మరో రెండు చిత్రాలు కూడా భారీ నష్టాలను చవి చూశాయి. అందులో గోపీచంద్ హీరోగా నటించిన 'రామబాణం' ఒకటి. దీనికి రూ. 16 కోట్లు వరకూ లాస్ వచ్చింది.

అలాగే, రవితేజ నటించిన 'రావణాసుర' మూవీకి కూడా రూ. 11 కోట్లు నష్టాలను చూసింది. మొత్తంగా ఈ ఐదు చిత్రాల్లో 'ఏజెంట్', 'రామబాణం' మాత్రం నిర్మాతలకు కూడా నష్టాలనే మిగిల్చాయి. మిగిలినవి బయ్యర్లకు షాకిచ్చాయి.