సాయి ధరమ్ తేజ్ మూవీకి ఆ టైటిల్ ఫిక్స్..!

Tue Dec 06 2022 09:53:04 GMT+0530 (India Standard Time)

Title Is Fixed For Sai Dharam Tej Movie..!

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ టీజర్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేస్తున్నారు. డిసెంబర్ 7న సాయి ధరం తేజ్ 15వ సినిమా ఎనౌన్స్ మెంట్ వస్తుంది. అయితే ఈ మూవీ టైటిల్ ఎనౌన్స్ చేయకముందే లీక్ అయ్యింది.తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ మూవీకి విరూపాక్ష అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. అసలైతే ఈ టైటిల్ తో పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందని అనుకున్నారు. కానీ మామ టైటిల్ ని అల్లుడు వాడేస్తున్నాడు. కార్తీక్ మొదటి సినిమానే అయినా చాలా క్లవర్ గా మూవీని తెరకెక్కించాడని తెలుస్తుంది.

సుకుమార్ కూడా ఈ మూవీకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా ఉండటంతో ఈ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. సాయి ధరం తేజ్ 15వ మూవీ గా వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై మెగా హీరో కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

లాస్ట్ ఇయర్ రిపబ్లిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సాయి ధరం తేజ్. ఆ సినిమా రిలీజ్ టైం లోనే సాయి తేజ్ కి యాక్సిడెంట్ జరిగింది. దాదాపు రెండు నెలల పాటు హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకున్న సాయి ధరం తేజ్ కొద్దిగా గ్యాప్ తీసుకుని మళ్లీ సెట్స్ కి వచ్చాడు.

సాయి ధరం తేజ్ విరూపాక్ష కచ్చితంగా ఆడియన్స్ ని థ్రిల్ అయ్యేలా చేస్తుందని అంటున్నారు చిత్ర యూనిట్. ఇక సినిమా ప్రమోషన్స్ ముందు నుంచి గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే సినిమా టైటిల్ అండ్ టీజర్ నే తారక్ తో రిలీజ్ చేయిస్తున్నారు.  

మెగా హీరోల్లో తన మార్క్ నటనతో అలరిస్తూ వస్తున్న సాయి ధరం తేజ్ సినిమా సినిమాకు తన క్రేజ్ పెంచుకుంటూ వచ్చాడు. అంతేకాదు సుప్రీం హీరోగా స్క్రీన్ నేమ్ కూడా సంపాదించుకున్న సాయి ధరం తేజ్ ఇక మీదట తన కెరీర్ వేగాన్ని పెంచాలని చూస్తున్నాడు. యాక్సిడెంట్ లైఫ్ ని.. కెరీర్ ని కొంత డిస్టర్బ్ చేసినా మళ్ళీ తను ఫాం లోకి రావాలని చూస్తున్నాడు. SDT15వా వస్తున్న ఈ విరూపాక్ష ప్రేక్షకులను ఏమేరకు ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి. ఈ మూవీ తర్వాత జయంత్ అనే మరో నూతన దర్శకుడితో సినిమా చేస్తున్నారు సాయి ధరం తేజ్. ఆ మూవీ కూడా కొత్తగా ఉండబోతుందని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.