మెగాస్టార్ సక్సెస్.. మరి కొరటాల ఏం చేస్తాడో?

Tue Jan 24 2023 19:00:01 GMT+0530 (India Standard Time)

Time To Prove For Koratala Shiva

మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ ఆశ్చర్య అనే సినిమా తెరకెక్కించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా మరో హీరోగా నటించాడు. తండ్రి కొడుకులు కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ కావడంతో ఆచార్య పై బాగా హైప్ క్రియేట్ అయింది. కచ్చితంగా ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొడతారని అందరూ భావించారు. అయితే ఊహించని విధంగా థియేటర్లోకి వచ్చిన మొదటి రోజే సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా కథ గాని కథనంలో గాని ఎక్కడ కూడా మెప్పించలేదు అనే మాట వినిపించింది. అలాగే కంటెంట్ లో కూడా ఎలాంటి లాజికల్ పాయింట్స్ లేకుండా దర్శకుడు కొరటాల కథనాన్ని నడిపించాలని విమర్శలు వినిపించాయి. ఓ విధంగా చెప్పాలంటే కొరటాల శివ కెరియర్లో అత్యంత పేలవమైన వర్క్ చేసిన మూవీ ఆచార్య కావడం విశేషం. కొరటాల శివ సినిమా అంటే కథ బలం ఉంటుంది. అలాగే సొసైటీ చేసే విధంగా మంచి సందేశాత్మక సంభాషణలు కూడా ఉంటాయి. అలాంటివి ఏమి ఈ సినిమాలో లేకపోవడం కూడా ఒక మైనస్ అని చెప్పాలి.

తన ఒరిజినల్ స్టోరీ పాయింట్ నుంచి బయటికి వచ్చి ఈ సినిమా చేయడం కూడా ఫ్లాప్ కి ఒక కారణం అనే మాట వినిపిస్తుంది. ఇలా ఉంటే ఆచార్య సినిమా ఫ్లాప్ ప్రభావం చిరంజీవిపై కూడా గట్టిగా పడిందని చెప్పాలి. అందుకే గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ లో తాజాగా వాల్తేరు వీరయ్య ప్రమోషన్ సక్సెస్ మీట్లలో దర్శకులను ఉద్దేశించి విమర్శలు చేశారు. చాలామంది దర్శకులు పూర్తిస్థాయి కథ లేకుండానే సినిమాలు స్టార్ట్ చేస్తారని అలాగే షూటింగ్ దగ్గరికి వచ్చి సీన్స్ రాసుకోవడం అలవాటుగా మారిపోయింది అని విమర్శించారు.

సినిమా కి ఎంత కంటెంట్ కావాలో అంత కాకుండా అనవసరమైన సీన్స్ తీసి నిర్మాతల బడ్జెట్ ని కూడా వృధా చేస్తారని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు కొరటాల శివని ఉద్దేశించి చిరంజీవి చేశారని మాట గట్టిగా వినిపించింది. దానిపై చిరంజీవి క్లారిటీ ఇస్తూ తాను కొరటాలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని అందరి దర్శకులకు కూడా ఇది వర్తిస్తుందని చెప్పుకోచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆచార్య ఫ్లాప్ తర్వాతనే చిరంజీవి ఎక్కువగా ఈ కామెంట్స్ చేయడం పట్ల కొరటాలను ఉద్దేశించి చేసినవని అందరూ బలంగా నమ్మారు.

ఇదిలా ఉంటే వాల్తేరు వీరయ్య సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో చిరంజీవి ఆచార్య ఫ్లాప్ మూడ్ నుంచి బయటికి వచ్చినట్లే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కొరటాల శివకి మాత్రం మళ్లీ తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ప్రస్తుతం కొరటాల శివ ఎన్టీఆర్ 30వ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసే ప్రయత్నంలో కొరటాల శివ అన్నారు. ఈ సినిమా ద్వారా మళ్ళీ తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. లేదంటే మెగాస్టార్ చిరంజీవి చేసిన విమర్శలు నిజమని ప్రజలు బలంగా నమ్ముతారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.