Begin typing your search above and press return to search.

నాని 'దసరా'.. దమ్ము చూపించే టైం ఇదే..!

By:  Tupaki Desk   |   29 March 2023 10:29 AM GMT
నాని దసరా.. దమ్ము చూపించే టైం ఇదే..!
X
నేచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెల కాంబోలో భారీ సినిమాగా తెరకెక్కింది దసరా. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మించారు. మరికొద్ది గంటల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రచార చిత్రాలు అదిరిపోగా అంచనాలకు తగినట్టుగానే సినిమా ఉండేలా ఉంటుందని అనిపిస్తుంది. ముఖ్యంగా నాని మాస్ యాటిట్యూడ్ సినిమాకు హైలెట్ అయ్యేలా ఉంది.

కీర్తి సురేష్ నటన కూడా సినిమాకు మరో అసెట్ అంటున్నారు. సినిమా కథ కథనాలే కాదు లీడ్ పెయిర్ యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని అంటున్నారు.

నాని కెరీర్ లోనే ఇంత భారీ హైప్ తో వస్తున్న సినిమా దసరా. అంతేకాదు ఈ సినిమాతో మొదటిసారి నాని పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు. సినిమాపై నాని కాన్ఫిడెన్స్ ఓ రేంజ్ లో ఉంది. థియేటర్ లు షేక్ అవ్వడం పక్కా అని చెబుతున్నాడు. సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో కూడా నాని ష్యూర్ షాట్ హిట్ కొడుతున్నాం అన్నట్టుగానే చెబుతున్నారు. 15 ఏళ్ల కెరీర్ లో నాని ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు ఈ సినిమా ఒక ఎత్తని చెప్పొచ్చు.

అంతేకాదు నాని దసరాతో నిజంగానే దమ్ము చూపించాల్సిన టైం. నేచురల్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్నా నాని సినిమాలు 100 కోట్ల మార్క్ రీచ్ కాలేదు. ఆ రేర్ ఫీట్ సాధించాలని చాలా కష్టపడుతున్నాడు నాని. అందుకే దసరా సినిమాను ఈ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నాడు. ఎలాగు పుష్ప లాంటి మాస్ మూవీ నార్త్ ఆడియన్స్ కి బాగా ఎక్కేసింది కాబట్టి అదే తరహా రా రస్టిక్ మూవీగా వస్తున్న దసరా కూడా హిందీ ఆడియన్స్ ని మెప్పిస్తుందని అంటున్నారు.

మన దగ్గర ఎలాగు సినిమాకు మంచి బజ్ ఉంది. నాని సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్నట్టు ఉంటుంది. అయితే హిందీలో మాత్రం ఈ సినిమా ఫస్ట్ టాక్ వచ్చాకే ఆడియన్స్ కు రీచ్ అవుతుంది.

దసరాతో తన రియల్ స్టామినా చూపించాలని చూస్తున్న నాని ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. నాని ప్రమోషనల్ జోష్ మాత్రం సినిమాపై ఆసక్తి కలిగేలా చేస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.