డీజే సౌండ్ మరింత పెంచాల్సిందే

Fri Jan 28 2022 19:00:01 GMT+0530 (India Standard Time)

Tillu Anna DJ Pedite Song

ఎల్ బీడబ్ల్యూ గుంటూర్ టాకీస్ కృష్ణ అండ్ హిస్ లీలా మన వింత గాధ వినుమా` వంటి విభిన్నమైన చిత్రాలతో హీరోగా తన కంటూ ప్రత్యేకతని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ. త్వరలో మరో విభిన్నమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్నచిత్రం `డీజే టిల్లు`. `అట్లుంటది మనతోని` అని ట్యాగ్ టైన్. సితార ఎంటన్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రానికి నేపథ్య సంగీతం తమన్ అందించారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ సాంగ్ పటాసు పిల్లా.. పాటలు సినిమాపై మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని విమల్ కృష్ణ తెరకెక్కించారు. పక్కా తెలంగాణ యువకుడిగా సిద్దూ జొన్నలగడ్డ నటించిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావాల్సింది కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల రిలీజ్ ని ఫిబ్రవరికి మార్చారు.  

శ్రీచరణ్ సంగీతం అంతించిన పాటలు ఇప్పటికే యూట్యూబ్ లో వైరల్ అవుతున్నాయి. 5 మిలియన్ వ్యూస్ దాటి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అంతే కాకుండా ఈ మూవీపై సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకుల్ని థియేటర్లలోకి తీసుకురావడానికి ఈ బజ్ సరిపోదని ఇంఆక ఏదో చేయాలని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. స్టార్ కాస్టింగ్ భారీగా వున్న సినిమాలపై భారీ రేంజ్ లో ప్రచారం చేస్తున్నారు.

మరి యంగ్ హీరో సినిమా కోసం ప్రేక్షకులు థియేర్లకు రావాలంటే ఎంతో కొంత హైప్ క్రియేట్ చేయాలి కదా.. డీజే సౌండ్ ఇంకా మోత మోగాల్సిందే కదా అని ఇండస్ట్రీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలోనూ కామెంట్ లు వినిపిస్తున్నాయి. మరి మేకర్స్ ఆ వైపు ఆలోచన చేసి సినిమాకు మరింత హైప్ ని క్రియేట్ చేస్తారని కామన్ ఆడియన్స్ ఆశిస్తున్నారు. పాటల్లో సిద్దూ జొన్నలగడ్డ నేహా శెట్టిల మధ్య కనిపిస్తున్న కెమిస్ట్రీ యూత్ ని థియేటర్లకు రప్పించేలా కనిపిస్తోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కానుంది.