Begin typing your search above and press return to search.

మాస్ రాజా టైగర్.. లిమిట్స్ దాటుతోందా?

By:  Tupaki Desk   |   31 May 2023 12:00 PM GMT
మాస్ రాజా టైగర్.. లిమిట్స్ దాటుతోందా?
X
మాస్ మహారాజ్ రవితేజ హీరో గా వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. రియల్ లైఫ్ రాబిన్ హుడ్ గా పేరుపొందిన స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు నిజ జీవిత కథతోనే ఈ సినిమా ని దర్శకుడు ఆవిష్కరించారు. ఆ ప్రాంతానికి వెళ్లి పూర్తిగా పరిశోధించి సిద్ధం చేసుకొని ఈ కథని జీవం పోసే ప్రయత్నం వంశీ కృష్ణ చేస్తున్నారు.

తాజాగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ తోనే టైగర్ నాగేశ్వరరావు మూవీ ని తాను ఎలా చూపించబోతున్నది దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు. ఇదిలా ఉంటే పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ పైన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మొత్తం ఐదు భాషలలో రెడీ చేస్తున్నారు. దీని కోసం ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కిస్తున్నారు.

టైగర్ నాగేశ్వరరావు కోసం ముందుగా 30 కోట్ల బడ్జెట్ అనుకున్నారంట. అయితే ఇప్పటి వరకు 50 కోట్ల వరకు ఖర్చయినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే మూవీ ఇంకా షూటింగ్ స్టేజ్ లోనే ఉంది. పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ స్టార్ట్ అయితే బడ్జెట్ మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. దానికి తోడు కచ్చితంగా మూవీ కి పాన్ ఇండియా ప్రమోషన్ ఉండాలి.

ఇలా ప్రమోషన్ లెక్కలతో కలిపి చూసుకుంటే కచ్చితంగా 70 కోట్ల వరకు ఖర్చయ్యే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. ఆ స్థాయిలో బడ్జెట్ అంటే కచ్చితంగా సినిమా కచ్చితంగా షేర్ రూపంలోనే 80 కోట్ల వరకు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక్క తెలుగు మార్కెట్ లో అయితే రవితేజ ఆ స్థాయిలో కలెక్ట్ చేయడం కష్టమనే చెప్పాలి.

పాన్ ఇండియా లెవల్ లో సక్సెస్ అందుకుంటే మూవీ బ్రేక్ ఎవెన్ సాదించే అవకాశం ఉంటుంది. అయితే అభిషేక్ అగర్వాల్ ఇప్పటికే ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 చిత్రాలతో పాన్ ఇండియా మార్కెట్ పై అవగాహన పెంచుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలో టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని కూడా ఇండియన్ వైడ్ గా మార్కెట్ చేసి పెట్టిన పెట్టుబడి వెనక్కి రాబట్టే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది.