నెట్ ఫ్లిక్స్ యూజర్లకు వేల కోట్ల గుడ్ న్యూస్

Wed Jan 19 2022 14:03:01 GMT+0530 (IST)

Thousands of crores of good news for Netflix users

ఇండియాలో ఓటీటీ గురించి పెద్దగా తెలియక ముందే అమెరికా సహా పలు దేశాల్లో నెట్ ఫ్లిక్స్ మంచి ఆధరణ దక్కించుకుంది. ఒకప్పుడు ఓటీటీ అంటే ఠక్కున వినిపించే పేర్లు నెట్ ప్లిక్స్. ప్రస్తుతం ఇండియాలో నెట్ ఫ్లిక్స్ విస్తరించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. నెట్ ఫ్లిక్స్ అంటేనే ప్రత్యేక హాలీవుడ్ వెబ్ సిరీస్ లు మరియు ఇతర భాషల వెబ్ సిరీస్ లు అనడంలో సందేహం లేదు. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా నెట్ ఫ్లిక్స్ వారు వందల కోట్ల రూపాయలతో వెబ్ సిరీస్ లను తెరకెక్కించి మెప్పించారు. నెట్ ఫ్లిక్స్ లో ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్న కొన్ని వెబ్ సిరీస్ లు ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన దక్కించుకున్నాయి. ముఖ్యంగా ఇటీవల వచ్చిన “స్క్విడ్ గేమ్” ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇండియా లో కూడా “స్క్విడ్ గేమ్” కు మంచి ఆధరణ దక్కింది. సౌత్ లాంగ్వేజ్ ల్లో కూడా “స్క్విడ్ గేమ్” వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేస్తున్నారు. దాంతో ఇండియాలో ఈమద్య కాలంలో నెట్ ఫ్లిక్స్ కు భారీ ఎత్తున ఖాతాదారులు అయ్యారు. ఇప్పుడు “స్క్విడ్ గేమ్” తరహా వెబ్ సిరీస్ లను ప్రేక్షకుల ముందుకు మరిన్ని తీసుకు వచ్చేందుకు గాను నెట్ ఫ్లిక్స్ ప్రయత్నాలు చేస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో స్ట్రీమింగ్ చేయడం కోసం దాదాపుగా 500 మిలియన్ డాలర్లు అంటే 3500 కోట్ల రూపాయలతో భారీ వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

అంతర్జాతీయ స్థాయిలో నెట్ ఫ్లిక్స్ యొక్క క్రేజ్ ను మరింతగా పెంచేందుకు గాను నెట్ ఫ్లిక్స్ వారు ఈ ప్రయత్నం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. 500 మిలియన్ డాలర్ల తో వెబ్ సిరీస్ లను తెరకెక్కించడం వల్ల ఖచ్చితంగా ప్రపంచ వ్యాప్తంగా నెట్ ఫ్లిక్స్ ను చూసే వారి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇటీవలే ఇండియాలో రేట్లను తగ్గించడం ద్వారా పెద్ద మొత్తంలో ఖాతా దారులను పెంచుకున్న నెట్ ఫ్లిక్స్ వారు ఇప్పుడు తమ కొత్త కంటెంట్ తో మరింత మంది దృష్టిని ఆకర్షించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.