హిట్టో ఫట్టో ఈ వారంలో తేలిపోతుంది..!!

Mon Feb 22 2021 22:00:01 GMT+0530 (IST)

This week collections will help bring movies into the profit zone

థియేటర్స్ రీ ఓపెన్ అయిన తర్వాత మ్మేకర్స్ అందరూ పోటీపడి సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. గత శుక్రవారం ఒక్కరోజే నాలుగు క్రేజీ మూవీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అల్లరి నరేష్ నటించిన 'నాంది' - అక్కినేని హీరో సుమంత్ 'కపటధారి' సినిమాలతో పాటు కన్నడ డబ్బింగ్ సినిమా 'పొగరు' - విశాల్ ద్విభాషా చిత్రం 'చక్ర' విడుదల అయ్యాయి. వీటితో పాటు పంజా వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' సినిమా రెండో వారం కూడా ప్రదర్శించబడింది.బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్స్ రాబట్టిన 'ఉప్పెన' సినిమా రెండో వారం కూడా పర్వాలేదనిపించుకుంటోంది. ఇక 'నాంది' సినిమా పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుని మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ వారంలో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలానే క్రైమ్ థ్రిల్లర్ గా 'కపటధారి' సినిమా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సాంగ్ తో సినిమాపై బజ్ క్రియేట్ చేసిన 'పొగరు' మంచి ఓపెనింగ్స్ అందుకుంది. సైబర్ క్రైమ్ నేపథ్యంలో వచ్చిన 'చక్ర' మిగతా సినిమాల కంటే ఎక్కువ ఓపెనింగ్స్ సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కాకపోతే ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ ని బట్టి చూసుకుంటే ఇంకా వసూలు చేయాల్సి ఉంది.

ఇప్పుడు ఈ నాలుగు సినిమాలకి సెకండ్ వీక్ వసూళ్ళు కీలకం కానున్నాయి. ఇవి ప్రాఫిట్ జోన్ లోకి రావాలంటే ఈ వారంలో వచ్చే కలెక్షన్లు హెల్ప్ అవుతాయి. ఏయే సినిమాలు బ్రేక్ అయ్యాయి.. ఏవి హిట్ అయ్యాయి అనేది కూడా తేలిపోతుంది. ఇక ఇప్పటికే 70 కోట్లకు పైగా వసూలు చేసిన 'ఉప్పెన' 100 కోట్ల క్లబ్ లో చేరుతుందో లేదో కూడా సెకండ్ వీక్ కలెక్షన్స్ డిసైడ్ చేస్తాయి.