Begin typing your search above and press return to search.

ఈ వారం ఒటీటీ సందడి గట్టిగానే ఉందిగా… ఓ లుక్కేయండి

By:  Tupaki Desk   |   6 Feb 2023 11:00 PM GMT
ఈ వారం ఒటీటీ సందడి గట్టిగానే ఉందిగా… ఓ లుక్కేయండి
X
ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా మాత్రమే ఉండేది. అయితే తరువాత టెలివిజన్ లో సీరియల్స్ వచ్చాయి. అయితే ఆ సీరియల్స్ ఎక్కువగా మహిళలని దృష్టిలో ఉంచుకొని తెరకెక్కిస్తూ ఉండటం వలన వాటితో ప్రేక్షకులకి ఆశించిన వినోదం అయితే రాలేదు. అయితే కాస్త  ట్రెండ్ మార్చి టాక్ షోలు, అలాగే గేమ్ షోలు బుల్లితెరపై సందడి చేయడం మొదలైంది. వీటితో కొంత ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయ్యింది. ఆ తరువాత రియాలిటీషోల సందడి మొదలైంది. అయితే సినిమాని బుల్లితెరని బీట్ చేసే విధంగా ఎంటర్టైన్మెంట్ కోసం ఇప్పుడు ఒటీటీ అందుబాటులోకి వచ్చింది.

డిజిటల్ మీడియా వినియోగం పెరగడంతో పాటు ఎక్కువగా ప్రజలు ఆన్ లైన్ లో ఉంటున్నారు. ఈ నేపధ్యంలో వీరిని దృష్టిలో ఉంచుకొని ఒటీటీ ఎంటర్టైన్మెంట్ ని స్టార్ట్ చేశారు. కరోనా సమయంలో దీనికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఓ విధంగా చెప్పాలంటే సినిమాలకి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఒటీటీ మారింది. చాలా మంది నటులు సినిమాలు చేస్తూనే ఒటీటీ వెబ్ మూవీస్, అలాగే వెబ్ సిరీస్ లలో కూడా చేస్తూ తమ ఎస్టాబ్లిష్ అవుతున్నారు. ప్రతివారం ఒటీటీలో వెబ్ సిరీస్ లు, సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాగే ఈ వారం ఒటీటీలో చూసుకుంటే కావాల్సింత ఎంటర్టైన్మెంట్ ఉంది.

ఈ వారం ఒటీటీలో రిలీజ్ కాబోయే సినిమాలు చూసుకుంటే తెలుగు మూవీ తెగింపు, బిల్ రసెల్ హాలీవుడ్ మూవీ ఫిబ్రవరి 8న రిలీజ్ కాబోతున్నాయి. మై డాడ్ ద బౌంటీ హంటర్, యూ సిరీస్ సీజన్ 4 పార్ట్ 1 ఫిబ్రవరి 9 న రిలీజ్ అవుతున్నాయి. డిస్నీ హాట్ స్టార్ లో రాజయోగం అనే సినిమా రాజయోగం ఫిబ్రవరి 9 స్ట్రీమింగ్ కాబోతుంది. హాన్సిక వెడ్డింగ్ ఫిల్మ్ హన్సిక లవ్ షాదీ డ్రామా ఫిబ్రవరి 10న వస్తుంది. మార్వెల్ స్టూడియోస్ లెజెండ్స్ సీజన్ 2 వెబ్ సిరిస్ కూడా అదే రోజు వస్తుంది.

అమెజాన్ ప్రైమ్ లో సుదీర్ బాబు హంట్ మూవీ, తెలుగు వెబ్ సిరీస్ ఫర్జీ ఫిబ్రవరి 10 స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఆహాలో సంతోష్ శోభన్ నటించిన కళ్యాణం కమనీయం సినిమా కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది. సోనీ లీవ్ లో సింగర్ స్మిత టాక్ షో ఫిబ్రవరి 10 నుంచి ప్రసారం కాబోతుంది. జీ5లో తెలుగు డబ్బింగ్ సినిమా వేద కూడా స్ట్రీమింగ్ అవుతుంది, అలాగే సలామ్ వెంకీ మూవీ కూడా ఫిబ్రవరి 10 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. వీటితో పాటు ఇతర భాషలకి సంబందించిన సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా ఫిబ్రవరి 10న ఆయా ఒటీటీ ప్లాన్ ఫామ్స్ లో ప్రసారం కాబోతూ ఉండటం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.