Begin typing your search above and press return to search.

ఈసారి థ్రిల్ల‌ర్.. ఓ బేబి నిర్మాత మ‌రో రీమేక్

By:  Tupaki Desk   |   27 Jan 2023 10:01 AM GMT
ఈసారి థ్రిల్ల‌ర్.. ఓ బేబి నిర్మాత మ‌రో రీమేక్
X
కొరియ‌న్ మూవీ రీమేక్ హక్కులను సొంతం చేసుకుని ఓ బేబి చిత్రాన్ని అధికారికంగా తెలుగులో నిర్మించారు సునీత తాటి. అగ్ర నిర్మాత‌ డి.సురేష్ బాబుతో క‌లిసి ఈ సినిమాను లేడీ ప్రొడ్యూస‌ర్ విజ‌య‌వంతంగా రూపొందించిన సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ నిర్మాత‌గా సునీత తాటికి మంచి పేరు వ‌చ్చింది.

సునీత తాటి ప్ర‌ముఖ‌ నిర్మాత. గురు ఫిల్మ్స్ బ్యాన‌ర్ లో తెలుగు చిత్రాలను నిర్మిస్తున్నారు. ఓ బేబీ- కొరియర్ బాయ్ కళ్యాణ్-సాహసమే శ్వాసగా సాగిపో లాంటి చిత్రాల‌తో సునీత తాటి నిర్మాత‌గా అనుభ‌వం ఘ‌డించారు . సునీత తాటి పుట్టి పెరిగింది విజయవాడలో. ఆమె జార్జ్ మాసన్ విశ్వవిద్యాలయం నుండి వ్యాపార నిర్వహణలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసారు. న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుండి ఫిల్మ్ మేకింగ్ లో పీజీ కోర్సును అభ్యసించారు.

తాజా స‌మాచారం ఆమె వ‌రుస‌గా కొరియ‌న్ సినిమాల‌ను రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు మరో కొరియన్ థ్రిల్లర్ ను తెలుగులోకి తీసుకురావడానికి నిర్మాత‌ సునీత‌ ప్లాన్ చేస్తున్నారు. హి ఈజ్ సైకోమెట్రిక్ అనే కొరియ‌న్ థ్రిల్ల‌ర్ సిరీస్ ని తెలుగైజ్ చేస్తున్నారు. స్క్రిప్టు ప‌నులు సాగుతున్నాయి. ఒక ప్రమాదం తర్వాత సైకోమెట్రిక్ శక్తులను కనుగొనే స్పెష‌లిస్ట్ రియ‌ల్ కథ ఏమిట‌న్న‌ది తెర‌పైనే చూడాల‌ని చెబుతున్నారు. గ‌తంలోనే ఆరు కొరియన్ చిత్రాలను రీమేక్ చేయబోతున్నామని నిర్మాత సునీత తాటి తెలిపారు.

ఓ బేబీ- సాకిని దాకిని తర్వాత 'హి ఈజ్ సైకోమెట్రిక్' కూడా కొరియ‌న్ మూవీ రీమేక్. త‌దుప‌రి మరో మూడు కొరియన్ రీమేక్ లను నిర్మిస్తారు. వాటిలో ఒకటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం తెలుగనువాదం జ‌రుగుతోంద‌ని స్క్రిప్టు ద‌శ‌లో ఉంద‌ని తెలిసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.