Begin typing your search above and press return to search.
ఈ మ్యాడమ్ ఇంకా ఆ హీరోని వదలదు
By: Tupaki Desk | 21 March 2023 8:58 AMఅవును.. ఈ మ్యాడమ్ ఆ హీరో ని అస్సలు వదలదు! నిన్నొదల అంటూ వెంటాడుతూనే ఉంది. వీలున్న ప్రతిసారీ ఫిలిం మాఫియా ఆగడాలను నిలదీసే సదరు కథానాయిక (క్వీన్ మ్యాడమ్) తన గతాన్ని తలచుకోవడమే గాక ఆ గతంలోని ప్రేమికుడిని కూడా గుర్తు చేసుకుంది. అతడి తో డీప్ లవ్ స్టోరీని నెమరు వేసుకుంది.
ఈ స్టోరీలో మ్యాడమ్ పేరు కంగన రనౌత్ కాగా హీరో గారి పేరు హృతిక్ రోషన్. బ్లాక్ బస్టర్ మూవీ క్రిష్ 3లో ఈ జోడీ కలిసి నటించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో హృతిక్ తో నిండా ప్రేమలో మునిగిన కంగన ఆ తర్వాత మోసపోయానని ఆవేదన చెందింది. రోషన్ ల కుటుంబం పై కంగన దండయాత్ర గురించి తెలిసినదే. ఈ ఎఫైర్ గొడవ కోర్టుల పరిధి వరకూ చేరుకుంది.
తాజాగా మరోసారి తన మాజీ ప్రేమికుడిని కంగన గుర్తు చేసుకుంది. హృతిక్ రోషన్ తో తన అత్యంత నాటకీయ ప్రేమకథ గురించి మాట్లాడింది. ఇక ఈ గొడవలో కి ఎలన్ మాస్క్ ని కూడా లాగింది కంగన. మస్క్ వైరల్ ట్వీట్ కు ధన్యవాదాలు అంటూ మొదలు పెట్టింది. హృతిక్ రోషన్ తో న్యాయ యుద్ధంగా మారిన తన నాటకీయ ప్రేమ వ్యవహారాన్ని కంగన మరోసారి గుర్తు చేసుకుంది. ఎలన్ మస్క్ వైరల్ ట్వీట్ తో రిలేట్ చేస్కుంది.
ఇంతకీ ఎలన్ ఏమన్నారంటే...వివరంలో కి వెళ్లాలి. "ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి మీ జీవితాన్ని అంకితం చేయకుండా మీ దృష్టి ని మరల్చడానికి CIA పంపిన పెయిడ్ యాక్టరని మీకు తెలిసినప్పుడు ప్రేమలో పడటం భిన్నంగా ఉంటుంది" అని ఎలోన్ చేసిన ఈ ట్వీట్ కు కంగన అద్భుతమైన రిప్లై ఇచ్చింది. క్వీన్ తన గతంలోకి వెళ్లింది. తన ప్రేమ వ్యవహారాన్ని అడ్డు పెట్టుకుని సినిమా మాఫియా అంతా తనను దాదాపు జైలులో పెట్టిన వైనాన్ని తలుచుకుంది.
కంగనా ట్వీట్ ఇలా ఉంది. "నా కంటే నాటకీయ జీవితాన్ని ఎవరైనా కలిగి ఉంటారని నేను ఎప్పుడూ అనుకోలేదు. ప్రేమ వ్యవహారంలో నన్ను జైలులో పెట్టడాని కి మొత్తం ఫిలిం మాఫియా ప్రయత్నించడం కంటే ఇది చాలా ఎగ్జయిట్ చేస్తోంది" అని వ్యాఖ్యానించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.