రాజ్ కుంద్రా భారీ రాకెట్ వెనుక కథాకమామిషూ ఇదే

Wed Jul 21 2021 11:54:07 GMT+0530 (IST)

This is the story behind Raj Kundra's huge rocket

అశ్లీల వీడియోలు తీసి యాప్స్ లో అప్ లోడ్ చేస్తున్నారన్న కారణంతో ముంబై పోలీసులు ప్రముఖ వ్యాపారవేత్త శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రాను కోర్టులో హాజరుపరిచారు. అతడి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని జూలై 23 వరకు కోర్టు పోలీసు కస్టడీకి పంపింది. 45 ఏళ్ల కుంద్రాపై నమోదైన కేసు అశ్లీల వీడియోలు తీయడం.. కొన్ని యాప్‌ల ద్వారా పోస్ట్ చేసినందుకు అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఈ మొత్తం అశ్లీల రాకెట్ వెనుక ఉన్నది రాజ్ కుంద్రా బంధువు.. యూకే పౌరుడౌన బక్షి అని సమాచారం. కుంద్రా సోదరిని వివాహం చేసుకున్న బక్షి బ్రిటన్ లోని లండన్ లో ఉంటున్నాడు. ఈయన కెన్రిన్ లిమిటెడ్ చైర్మన్ గా ఉన్నాడు.

కెన్నిన్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ‘హాట్ షాట్స్ డిజిటల్ ఎంటర్ టైన్ మెంట్’ అనే మొబైల్ యాప్ ను రాజ్ కుంద్రాతో కలిసి బక్షి సంయుక్తంగా నిర్వహిస్తున్నారని ముంబై జాయింట్ పోలీస్ కమిషనర్ (క్రైమ్) మిలింద్ భరంబే తెలిపారు.

హాట్ షాట్ ల యాప్ ను ప్రపంచంలోని 18 సంవత్సరాలు నిండిన ఎవరైనా డౌన్ లోడ్ చేసుకొని వాడేలా రూపొందించారు. ఇందులో ప్రపంచంలోనే ప్రత్యేకమైన హాటెస్ట్ మోడల్స్ షార్ట్ ఫిల్మ్ లు హాట్ వీడియోలను ప్రదర్శిస్తారు. ఇది ఒక సాఫ్ట్ అశ్లీల యాప్ గా రూపొందించినట్టు తెలుస్తోంది.

ఇక ఈ యాప్ నుంచి ఉచితంగా అశ్లీల కంటెంట్ ను డౌన్ లో చేసుకునేలా రూపొందించారు. తాజాగా కేసు నేపథ్యంలో ఆపిల్ గూగుల్ ప్లే స్టోర్ లు రెండింటి నుంచి యాప్ ను ఆపేశారు. దర్యాప్తులో ముంబై పోలీసులు అనేక హాట్ హాట్ అశ్లీల చిత్రాలు వీడియో క్లిప్ లు వాట్సాప్ చాట్లను సేకరించారు’ అని పోలీస్ కమిషనర్ భరంబే మీడియా సమావేశంలో తెలిపారు.

2021 ఫిబ్రవరిలో కుంద్రా పై కేసు నమోదైంది. ఈ వ్యవహారంపై దర్యాప్తును పోలీసులు ప్రారంభించారు. మాల్వాని పోలీస్ స్టేషన్ లో కేసును నమోదు చేసి దర్యాప్తు చేశారు. అశ్లీల కంటెంట్ ను ఉత్పత్తి చేయబడిందని.. మారుమూల తీర ప్రాంతాల్లోని పరిసరాల్లో ఈ వీడియోలను రూపొందించారని పోలీసులు తెలిపారు. ముంబైలోని మలాడ్ వాయువ్య ప్రాంతంలో ఈ అశ్లీల వీడియోలు తీశారని వివరించారు.

బాలీవుడ్ కు కేంద్రమైన ముంబైకి దేశం నలుమూలల నుంచి వస్తున్న కొత్త ఔత్సాహిక నటీమణులను రాజ్ కుంద్రా బ్యాచ్ ఆకర్షించినట్టు తెలిసింది. షార్ట్ ఫిల్మ్స్ వెబ్‌సిరీస్ లు .. ఇతర సినిమాల్లో వర్క్ ఆఫర్‌లతో ఆకర్షించారని.. అనంతరం వారితో అశ్లీల వీడియోలు తీయించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. "వారిని ఆడిషన్స్ కోసం పిలిచారు. బోల్డ్ సన్నివేశాలను ఎంపిక చేసిన తరువాత ఇది సెమీ న్యూడ్ అని.. తరువాత పూర్తి నగ్న షూట్లలోకి తీసుకెళ్లారు. వారిలో కొందరు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. వారే పోలీసులను సంప్రదించారు" అని కమిషనర్ భరంబే చెప్పారు.

కంటెంట్‌ను తయారు చేసిన తరువాత వయాన్ -కేండ్రిన్ అనే రెండు సంస్థలు వాటిని మొబైల్ యాప్స్ లో అప్ లోడ్ చేసి అందుబాటులో ఉంచాయి. ఓటీటీ ప్లాట్‌ఫారంలకు సమానంగా దీనికోసం డబ్బులను ప్రతి వీడియోకు వసూలు చేశాయి. వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఏ రూపంలోనైనా అశ్లీల చిత్రాలను నిషేధించినందున భారతదేశంలో ఇవి చట్టవిరుద్ధం అని పోలీసులు తెలిపారు..

దర్యాప్తు తరువాత కుంద్రా అతని టెక్కీ అసోసియేట్ ర్యాన్ జె. తార్పేతో సహా ఇప్పటివరకు కనీసం 12 మందిని పోలీసులు అరెస్టులు చేశారు. వీరిని జూలై 23 వరకు పోలీసు కస్టడీకి ముంబై మేజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ విధించింది. ఇంతకుముందు అరెస్టయిన తొమ్మిది మందిలో టీవీ నటి గెహ్నా వశిష్ట్ యాస్మిన్ ఆర్. ఖాన్ మోను జోషి ప్రతిభా నాలావాడే  ఎం. అతిఫ్ అహ్మద్  దీపాంకర్ పి. ఖాస్నవిస్ భానుసూర్యు ఠాకూర్  తన్వీర్ హష్మి ఉమేష్ కామత్ లు ఉన్నారు.

కుంద్రా సన్నిహితుడైన కమత్ వియాన్ దేశంలో ఈ అశ్లీల వీడియోల కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్నారు. కంటెంట్ క్రియేషన్స్ ఖాతాలు.. ఇతర వివరాలతో పాటు కేండ్రిన్ లిమిటెడ్ తో దీన్ని నిర్వహిస్తున్నారు.   "చాలా మంది పెద్ద సెలబ్రిటీలు మోడల్స్-నటులు-నటీమణులు కూడా ఇందులో పాల్గొంటున్నట్లు  పుకార్లు ఉన్నాయి. భారతదేశంలో -విదేశాలలో రహస్య ప్రదేశాలలో 'సెక్స్-రేవ్ పార్టీలు' నిర్వహించబడతాయి ఇవి చిత్రీకరించబడతాయి.. తరువాత 'హాట్ కంటెంట్' గా ప్యాక్ చేయబడతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో మిలియన్ల కొద్దీ వీటిని అమ్ముతారు "అని ఒక అగ్ర నిర్మాత మీడియాకి చెప్పారు.

మొత్తంగా రాజ్ కుంద్రా భారీగా దీనికోసం ప్లాన్ చేశారని.. దీనివెనుక పెద్ద నెట్ వర్క్ ఉందన్న విషయాలు పోలీసుల విచారణలో బయటపడుతున్నట్టు తెలుస్తోంది.