అత్యంత ఖరీదైన మహేష్ బాబు కొత్త కార్వాన్ ఇదే..!

Sat Mar 06 2021 13:00:01 GMT+0530 (IST)

This is the most expensive Mahesh Babu new caravan

సూపర్ స్టార్ మహేష్ బాబుకు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బ్రాండ్ ఎండార్స్మెంట్స్ తో సంపాదిస్తుంటారు. టాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలలో ఒకరైన మహేష్.. దానికి తగ్గట్టే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. తాజాగా మహేష్ బాబు తన రేంజ్ కు తగ్గట్లుగా అత్యాధునిక కార్వాన్ ను రెడీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ముంబైకి చెందిన ఓ ఇంటీరియర్ డిజైనర్ మహేష్ అభిరుచికి తగ్గట్టుగా అద్భుతంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.అద్భుతమైన ఇంటీరియర్ తో విలాసవంతగా ఉన్న ఈ కార్వాన్ కోసం మహేష్ భారీగానే ఖర్చు చేసారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేష్ కొత్త కార్వాన్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇది కూడా మహేష్ లక్కీ నెంబర్ 4005 తో రిజిస్టర్ చేయబడటం గమనార్హం. ఇదిలావుండగా ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు.. ఇటీవలే దుబాయ్ లో లాంగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని ఇండియాకి తిరిగి వచ్చాడు. పరశురామ్ పేట్లా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. 14 రీల్స్ ప్లస్ - మైత్రీ మూవీ మేకర్స్ - జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 2022 సంక్రాంతి కానుకగా 'సర్కారు వారి పాట' విడుదల కానుంది.