నేను జీవితంలో నేర్చుకున్న గొప్ప గుణపాఠం ఇదే: సమంత

Sun Dec 05 2021 12:00:01 GMT+0530 (IST)

This is the greatest lesson I have ever learned in life Samantha

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో మనకు తెలిసిందే. పర్సనల్ లైఫ్ పాటుగా తన ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా ఈ వేదికగా పంచుకుంటూ ఉంటారు. ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తన భావాలను నెట్టింట వెల్లడిస్తూ ఉంటుంది. ఇక తన భర్త అక్కినేని నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సామ్ ఇన్స్టాగ్రామ్ లో మరింత యాక్టీవ్ అయింది.'మై మమ్మా సెడ్' (మా అమ్మ చెప్పింది) అనే హ్యాష్ ట్యాగ్ తో సందేశాత్మక సూక్తులను పోస్ట్ చేస్తూ వస్తోంది సమంత. ప్రేమ - పెళ్లి - జీవితం.. ఇలా ఏదొక విషయం మీద కొటేషన్ ని షేర్ చేస్తూ నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తోంది. చైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత సామ్ పోస్ట్ చేస్తున్న కోట్స్ కావడంతో.. అందరూ వారి వివాహ బంధానికి లింక్ చేస్తూ వీటిపై డిస్కష్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అగ్ర కథానాయిక మరో కొత్త సూక్తితో ముందుకు వచ్చింది.

''నేను జీవితంలో నేర్చుకున్న గొప్ప పాఠం ఏమిటంటే.. నేను ఇంకా నేర్చుకోవలసింది చాలా ఉంది'' అని సమంత ఓ కొటేషన్ ని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టింది. ''చాలా విషయాలు బాగానే ఉంటాయి.. కానీ అన్నీ అలా ఉండవు. కొన్నిసార్లు మీరు ఎంత పోరాటం చేసినా ఓడిపోతారు. కొన్నిసార్లు మీరు చాలా గట్టిగా పట్టుకుంటారు కానీ వదిలివేయడం తప్ప వేరే మార్గం లేదని తెలుసుకుంటారు. అంగీకారం అనేది ఒక చిన్న నిశ్శబ్ద గది'' అని మరో కోట్ ని సామ్ షేర్ చేసింది.

జీవితం నేర్పిన పాఠం.. ఎంత పోరాడిన ఓడిపోతాం అంటూ సమంత పోస్ట్ చేసిన సూక్తులు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. తన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకొని రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సామ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ కోటేషన్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో జీవితసారం గురించి ఎలాంటి సందేశాలు ఇస్తుందో చూడాలి.

ఇకపోతే కెరీర్ పరంగా సమంత మళ్లీ ఫుల్ ఫార్మ్ లోకి వచ్చింది. ఇప్పటికే రెండు సినిమాలను కంప్లీట్ చేసి మరో మూడు కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసింది. అందులో రెండు బైలింగ్వల్ సినిమాలు కాగా.. మరొకటి ఇంటర్నేషనల్ మూవీ. హాలీవుడ్ దర్శకుడు తెరకెక్కించే 'అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్' చిత్రంలో బైసెక్సువల్ తమిళ యువతి పాత్రలో సామ్ కనిపించనుంది.

అలానే సమంత తన కెరీర్ లోనే ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్ చేయడానికి రెడీ అయింది. 'పుష్ప: ది రైజ్' సినిమాలో చేస్తున్న ఈ స్పెషల్ సాంగ్ మీద అంచనాలు పెరిగిపోయాయి. ఇక సోషల్ మీడియాలో సామ్ అరుదైన ఘనత సాధించింది. ఇన్స్టాగ్రామ్ లో 20 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకుంది.