Begin typing your search above and press return to search.

సినీ వార‌సుల కెరీర్‌ ప్లానింగ్ అంటే ఇదీ.. కీరవాణిని చూసి నేర్చుకోవాలట!

By:  Tupaki Desk   |   24 Feb 2021 3:30 AM GMT
సినీ వార‌సుల కెరీర్‌ ప్లానింగ్ అంటే ఇదీ.. కీరవాణిని చూసి నేర్చుకోవాలట!
X
ఏ త‌ల్లిదండ్రులైనా తాము అద్భుతంగా సెట్ అయిపోయిన కెరీర్ లో త‌మ వార‌సుల‌ను కూడా నిల‌బెట్టాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతుంటారు. ఈ ప‌రిస్థితి పొలిటిక‌ల్‌, సినీ రంగాల్లో ఎక్కువ‌గా ఉంటుంది. ఇందులోనూ సినిమా ఇండ‌స్ట్రీలో ఈ ధోర‌ణి మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. అయితే.. ఎంట్రీకి అవ‌కాశం అంద‌రికీ ఉన్న‌ప్ప‌టికీ.. స‌క్సెస్ మాత్రం కొంద‌రికే సాధ్య‌మ‌వుతుంది. ఇందులో అదృష్టాలు, దుర‌దృష్టాల సంగ‌తి ఎలా ఉన్నా.. ప్లానింగ్ మాత్రం ప‌క్క‌డా ఉండ‌డం కంప‌ల్స‌రీ. ఈ విష‌యంలో కీర‌వాణి ప్లాన్ కేక అంటున్నారు సినీ జ‌నాలు.

నిజానికి తెలుగు ఇండ‌స్ట్రీలో చాలా మంది మ‌హామ‌హులు త‌మ వార‌సుల‌ను ఇంట్రుడ్యూస్ చేశారు. కానీ.. స‌క్సెస్ ఫుల్ గా కంటిన్యూ అవుతున్న‌వారు మాత్రం కొంద‌రే. అక్కినేని నాగార్జున‌, అల్లు అర‌వింద్‌, మోహ‌న్ బాబు తోపాటు ఇంకా ఎంతో మంది పేరున్న‌ నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు త‌మ వార‌సుల కెరీర్ ను గాడిలో పెట్ట‌డానికి తీవ్రంగానే ప్ర‌య‌త్నిస్తున్నారు.

నాగార్జున చిన్న కొడుకు అఖిల్‌, అల్లు అరవింద్ చిన్న కుమారుడు శిరీష్‌, మోహ‌న్ బాబు రెండో కుమారుడు మ‌నోజ్ వీళ్లంతా పెద్ద ఫ్యామిలీల నుంచే ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన‌ప్ప‌టికీ.. ప‌లు సినిమాలు చేసిన‌ప్ప‌టికీ.. నిల‌దొక్కుకునేందుకు ఇంకా దండ‌యాత్ర‌లు చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఎంతోమంది హీరోలను స్టార్లు గా మార్చిన పూరి జగన్నాథ్ ప‌రిస్థితి కూడా ఇలాగే ఉంది. త‌న త‌మ్ముడు సాయిరామ్ శంక‌ర్ ను హీరోగా నిల‌బెట్ట‌డానికి చాలా ప్ర‌య‌త్నించినా స‌క్సెస్ రాలేదు. ఇక‌, తన కొడుకు ఆకాశ్‌కు కూడా బ్రేక్ ఇవ్వలేకపోయాడు. ఇలా ఎంతో మంది వార‌సుల కెరీర్ ను స‌రిగా ప్లాన్ చేయ‌లేక‌పోయారు.

కానీ.. ఈ విష‌యంలో సంగీత దర్శకుడు కీరవాణి మాత్రం తన ఇద్దరు కొడుకుల కెరీర్ కూడా సూప‌ర్ గా సెట్ చేశాడ‌ని అంటున్నారు. కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవ సింగ‌ర్ గా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత సంగీత దర్శకుడిగా మారాడు. తొలి చిత్రం 'మత్తు వదలరా'తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన‌ 'కలర్ ఫోటో' పెద్ద బ్రేకే ఇచ్చింది. ఈ సినిమా పాటలు అంద‌రినీ అల‌రించాయి. ప్ర‌స్తుతం కాలభైరవ చేతిలో మూణ్నాలుగు సినిమాలున్నాయి. ఇందులో ఏ రెండు సినిమాలు స‌క్సెస్ అయినా.. అత‌ని కెరీర్ అలా సాగుతూనే వెళ్తుంది.

ఇక‌, చిన్న కొడుకు సింహా హీరోగా వ‌చ్చాడు. 'మత్తువదలరా' సినిమాతో అటు పెద్ద కొడుకు మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా, ఇటు చిన్న‌కొడుకు హీరోగా మంచి స‌క్సెస్ అందుకున్నారు. ఇమేజ్ చ‌ట్రంలో ఇరుక్కుపోకుండా.. డీసెంట్ గా లాంచ్ అయ్యాడు సింహా. ఇప్పుడు అత‌ను న‌టిస్తున్న చిత్రం 'తెల్లవారితే గురువారం.' భిన్న‌మైన కాన్సెప్ట్ తో వ‌స్తున్నార‌ని టైటిల్ చూస్తేనే అర్థ‌మ‌వుతోంది. ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ కాకుండానే.. 'బాగ్ సాలే' అంటూ డిఫ‌రెంట్ సినిమాను అనౌన్స్ చేశాడు సింహా. ప్రణీత్ అనే షార్ట్ ఫిలిం దర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ మూవీ ప్రీ-లుక్ పోస్టర్ చాలా ఇంప్రెసివ్ గా క‌నిపిస్తోంది. సురేష్ బాబు, మధుర శ్రీధర్ రెడ్డి, యాశ్ రంగినేని లాంటి టాప్ ప్రొడ్యూస‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ విధంగా.. త‌న కొడుకులు ఇద్ద‌రినీ ఎలాంటి హ‌డావిడి చేయ‌కుండా చ‌క్క‌గా లాంఛ్ చేశాడు కీర‌వాణి అని అంటున్నారు ప‌లువురు. ఇత‌ర సినీ పెద్ద‌ల్లాగా హంగూ అర్భాటాలు చేయ‌కుండా వారి కెరీర్ ను ప్లాన్ చేశాడ‌ని చ‌ర్చించుకుంటున్నారు.