Begin typing your search above and press return to search.
ఇది కదా కావాల్సింది.. ఆడియన్స్ రియాక్షన్
By: Tupaki Desk | 26 Jan 2023 8:00 PMబాలీవుడ్ లో సాలిడ్ సక్సెస్ పడి దాదాపుగా నాలుగు సంవత్సరాలు అవుతోంది. కరోనా మొదలు అయినప్పటి నుండి కూడా బాలీవుడ్ సినిమాలు అంటే స్వయంగా ఉత్తరాదిన చిన్న చూపు మొదలు అయ్యింది. నార్త్ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం లేదా అంటే సౌత్ సినిమాలు వచ్చిన సమయంలో క్యూ కడుతున్నారు. కానీ హిందీ సినిమాలను మాత్రం పట్టించుకోలేదు.
చాలా కాలం తర్వాత హిందీ సినిమా కోసం నార్త్ ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తన పఠాన్ సినిమా కోసం జనాలు క్యూ కట్టేలా చేశాడు. షారుఖ్ చేశాడు అనే కంటే దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ చేశాడు అంటే సరిగ్గా ఉంటుంది.. న్యాయం జరుగుతుంది అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సౌత్ యాక్షన్ సినిమాలకు.. ఊర మాస్ యాక్షన్ సన్నివేశాలకు అలవాటు పడ్డ హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ పఠాన్ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను మరియు హీరో యొక్క ఎలివేషన్ తీర్చి దిద్దాడు. ఫక్త్ సౌత్ మాస్ మసాలా యాక్షన్ సినిమా అన్నట్లుగా పఠాన్ ఉందనే టాక్ వినిపిస్తుంది.
ముఖ్యంగా హీరోను యాక్షన్ సన్నివేశాల్లో చూపించిన తీరు మరియు సల్మాన్ ఖాన్ యొక్క ఇంట్రడక్షన్ ఇంకా ఇద్దరు హీరోల మధ్య సాగే సరదా సన్నివేశం ప్రేక్షకులు సర్ ప్రైజ్ అయ్యే విధంగా తెరకెక్కించాడు. షారుఖ్ మరియు సల్మాన్ లను వెండి తెరపై మురిసి పోయేలా దర్శకుడు సన్నివేశాలను తీర్చి దిద్దారు.
సల్మాన్ ఖాన్ ఉన్నంత సమయం కూడా ప్రేక్షకులు ఓ ఫీల్ లో తేలిపోయేలా సన్నివేశాలను రూపొందించారు. ఇలాంటి యాక్షన్ సన్నివేశాలు.. ఇలాంటి మాస్ సన్నివేశాలను హిందీ ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
సినిమా కథ విషయంలో పెద్దగా చెప్పుకోవడానికి లేదు కానీ ఎలివేషన్స్ మరియు యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఇలాంటి సినిమాలు బాలీవుడ్ లో రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.