Begin typing your search above and press return to search.

బ‌న్ని ఫ్యాన్స్ కి నిరాశ క‌లిగించేదే ఇది!

By:  Tupaki Desk   |   14 Aug 2022 3:30 AM GMT
బ‌న్ని ఫ్యాన్స్ కి నిరాశ క‌లిగించేదే ఇది!
X
దక్షిణాదిన అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో విజయ్ సేతుపతి ఒకరు. విల‌క్ష‌ణ‌మైన క‌థ‌లు పాత్ర‌ల‌తో అత‌డు త‌న‌కు తానే సాటి అని నిరూపిస్తున్నారు. అతడు త‌న స్టార్ డ‌మ్ కి భిన్నంగా వ్య‌క్తిగ‌త జీవితాన్ని ఫోక‌స్ కి దూరంగా ఉంచుతాడు. మీడియా గ్లేర్ -సోషల్ మీడియాల‌కు దూరంగా లోప్రొఫైల్ లో లైఫ్ ని కొనసాగిస్తున్నాడు. ఇటీవ‌ల‌ మాస్టర్- విక్రమ్- 96- విక్రమ్ వేద లాంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. కమల్ హాసన్ - ఫహద్ ఫాజిల్ లాంటి స్టార్ల‌తో కలిసి `విక్రమ్` మూవీలో న‌టించాడు. ఈ చిత్రంలో అత‌డి న‌టన‌కు ప్ర‌శంస‌లు కురిసాయి. సేతుప‌తి ప‌రిశ్ర‌మ‌లో డిమాండ్ ఉన్న న‌టుడు. అనేక పాన్-ఇండియా ప్రాజెక్ట్ ల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు.

అయితే సేతుప‌తిపై ఇబ్బ‌డిముబ్బ‌డిగా క‌థ‌నాలు ప్ర‌చారంలో ఉన్నాయి. అత‌డు పుష్ప 2లో న‌టిస్తున్నాడ‌ని.. అలాగే షారూక్ ఖాన్ జ‌వాన్ లోనూ అతిథి పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని ప్ర‌చారం సాగుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక క‌న్ఫ‌ర్మేష‌న్ లేక‌పోవ‌డంతో అభిమానులు చాలా క‌న్ఫ్యూజ‌న్ లో ఉన్నారు.

తాజాగా విజయ్ సేతుపతి సినిమాల‌ లైనప్ గురించి ట్వీట్ ఒక‌టి కొత్త విష‌యాల్ని బ‌హిర్గ‌తం చేసింది. ఆ ట్వీట్ సారాంశం ఇలా ఉంది. ``ఇప్పుడు #విజయ్ సేతుపతి సార్ కేవలం #షారూఖ్ ఖాన్ సార్ జవాన్ లో మాత్రమే నెగెటివ్ రోల్ చేస్తున్నారు. ఊహాగానాలు జరుగుతున్నట్లుగా అతను మరే ఇతర తెలుగు ప్రాజెక్ట్ ల్లోనూ నెగిటివ్ రోల్ పోషించడం లేదు`` అని స్పష్టం చేసారు.

షారూక్ ఖాన్ క‌థానాయ‌కుడిగా అట్లీ కుమార్ దర్శకత్వం వహిస్తున్న `జవాన్‌`లో విజయ్ సేతుపతి న‌టిస్తున్నార‌న్న విష‌యంపైనా చిత్ర‌ బృందం నుండి ఇది మొదటి అధికారిక ప్ర‌క‌ట‌న‌. అలాగే నెగటివ్ షేడ్స్ లో అతని పాత్ర అల‌రిస్తుంద‌ని కూడా టాక్ వినిపిస్తోంది. సేతుప‌తి గ్రే షేడ్ క్యారెక్టర్ ను పోషిస్తే అది సినిమా వెయిట్ పెంచుతుంది. షారుఖ్ ఖాన్ తో త‌ల‌ప‌డితే ఫ్యాన్స్ లో కిక్కు పెరుగుతుంది. ఇది త‌మిళ మార్కెట్ కి కూడా పెద్ద ప్ల‌స్ అవుతుంది. ఇక‌ విజయ్ సేతుపతి తో జవాన్ తదుపరి షెడ్యూల్ చెన్నైలో ఈ నెలాఖరులో ప్రారంభమవుతుంది. అలాగే రజనీకాంత్ జైలర్ లో కూడా సేతుప‌తి న‌టించ‌నున్నాడ‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

తాజా అధికారిక నిర్ధార‌ణ‌తో `పుష్ప: ది రూల్‌`లో సేతుప‌తి న‌టించ‌డం లేద‌నేది బ‌న్ని ఫ్యాన్స్ ని కొంత నిరాశ‌ప‌రిచేదే. ఇటీవ‌ల విక్ర‌మ్ లో మ‌రోసారి విజ‌య్ సేతుప‌తి విశ్వ‌రూపం చూశాక అత‌డు పుష్ప 2లో ఉంటే మ‌రింత వెయిట్ పెరుగుతుంద‌ని భావించారు. కానీ అది సాధ్య‌ప‌డ‌ద‌ని క్లారిటీ వచ్చేసింది. ఇక సేతుప‌తి మిస్స‌యినా విక్ర‌మ్ మూవీలో మ‌రో కీల‌క పాత్ర‌తో అల‌రించిన ఫ‌హ‌ద్ ఫాజిల్ మాత్రం పుష్ప 2లో న‌టిస్తున్నారు.

జవాన్ చిత్రం 2023 జూన్ 2 న విడుద‌ల కానుంది. భారతదేశం అంతటా 5 విభిన్న భాషలలో ఈ మూవీ రిలీజ్ బ‌రిలో దిగుతుంది. 2019లో IPL మ్యాచ్ లో షారూక్ తో క‌లిసి దర్శకుడు అట్లీ కుమార్ కనిపించినప్పుడు అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. ఆ త‌ర్వాత చాలా కాలం అయ్యాక షారూక్ తో అట్లీ సినిమా ప్రారంభ‌మైంది. కరోనావైరస్ ఈ ప్రాజెక్ట్ బాగా డిలే అవ్వ‌డానికి కార‌ణ‌మైంది. అయితే ఇప్ప‌టికే రిలీజ్ తేదీని లాక్ చేయ‌డంతో దీనిపై అంద‌రికీ స్ప‌ష్ఠ‌త వుంది.