సాయిధరమ్ తేజ్ హెల్త్ అప్డేట్ ఇదీ

Tue Sep 14 2021 14:00:54 GMT+0530 (IST)

This is Sai dharam Tej Health Update

మెగా హీరో సాయిధరమ్ తేజ్ బైక్ స్కిడ్ అయ్యి తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవలే ఆయన భుజం గాయానికి శస్త్రచికిత్స కూడా చేశారు. అపోలో వైద్యులు దగ్గరుండి మరీ సాయిధరమ్ తేజ్ ను కనిపెట్టుకొని ఉంటున్నారు.ఇక మెగా అభిమానులు సాయిధరమ్ తేజ్ కోలుకోవాలని మొక్కని దేవుడు లేదు.. తొక్కని దేవాలయం గడప లేదు. వారందరి అభిమానంతో ఇప్పుడు సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి ఆయన సోదరులు కుటుంబ సభ్యులు సోమవారం రోజంతా అపోలో ఆస్పత్రిలోనే ఉన్నారు. వీరందరినీ ఒక విషయం కలవరపెడుతోందని అంటున్నారు. అదేంటంటే ఐదు రోజులుగా సాయిధరమ్ తేజ్ వెంటిలేటర్ మీదనే ఉండడం కంగారుపెడుతోందని అంటున్నారు.

ఎక్కువ రోజులు ఐసీయూలో వెంటిలేటర్ పై ఉంటే శరీరం మీద వేరే ప్రభావాలు చూపిస్తాయని అంటున్నారు. అందుకే దాన్ని తీసేసి స్వతహాగా సాయిధరమ్ తేజ్ కోలుకునే పద్ధతులపై మెగా ఫ్యామిలీ అంతా డిస్కస్ చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్ ’ షూటింగ్ లో ఉన్నారు. వీలు చూసుకొని అపోలో ఆస్పత్రికి వెళ్లి సాయిధరమ్ ఆరోగ్యం విషయంలో చేయాల్సిన వాటిపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈరోజు కానీ.. రేపు కానీ వెంటిలేటర్ ను తొలగించి చికిత్స చేస్తారని సమాచారం.