Begin typing your search above and press return to search.

ప్రియ‌ద‌ర్శి కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇదే

By:  Tupaki Desk   |   20 Jun 2021 7:03 AM GMT
ప్రియ‌ద‌ర్శి కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇదే
X
'పెళ్లి చూపులు` చిత్రంతో నిరూపించుకుని ప్రియ‌ద‌ర్శి క‌మెడియ‌న్ గా పాపుల‌ర‌య్యారు. ఆ సినిమా త‌ర్వాత అత‌డు స్టార్ క‌మెడియ‌న్ గా ఎదిగాడు. ప్ర‌స్తుతం అతడు క్ష‌ణం తీరిక లేనంత బిజీ. ఓవైపు ఓటీటీలు మ‌రోవైపు సినిమాల‌తో అత‌డు పూర్తి బిజీగా ఉన్నాడు.

ప్రియ‌ద‌ర్శి న‌టించిన `ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్` వెబ్ సిరీస్ ఆహాలో రిలీజైంది. విద్యా సాగర్ ద‌ర్శ‌కత్వం వ‌హించారు. వెట‌ర‌న్ డైరెక్ట‌ర్ సురేష్ క్రిష్ణ ఈ సిరీస్ నిర్మాత‌. ఇందులో ద‌ర్శి ధైర్య‌వంతుడైన యువ‌కుడిగా న‌టించారు. విల‌క్ష‌ణ‌ పాత్రలు చేయగల కొద్దిమంది నటులలో ప్రియదర్శి మ‌రోసారి నిరూపించాడ‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. అత‌డు ధృఢ‌మైన కామిక్ పాత్రతో అరంగేట్రం చేసినా బహుముఖ నటుడిగా స‌త్తా చాటుతున్నాడు.

ఎమోష‌న్ తో ఆక‌ట్టుకునే గొప్ప‌ పాత్రలు చేయ‌గ‌ల‌డు. OTT సినిమాలతోనూ స్టార్ గా ఎదిగే స‌త్తా ఉన్న‌వాడిగా పేరు మార్మోగుతోంది. తాజాగా ఆహాలో `ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్` రిలీజైంది. ఇందులో ప్రియదర్శి ఆది పాత్రను పోషించారు. అతను స‌హ‌జ‌సిద్ధ‌మైన న‌టనతో ఆక‌ట్టుకున్నాడు. ఇది ఇప్పటి వరకు అతని ఉత్తమ ప్రదర్శన అని చెప్పవచ్చు. అతను తన పాత్రకు సోషల్ మీడియాలో మంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.