హాలీవుడ్ ప్రపంచంలో ప్రభాస్ ఫస్ట్ మూవీ ఇదే!

Wed Jun 29 2022 14:06:10 GMT+0530 (IST)

This is Prabhas first movie in the Hollywood world

తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన హీరోల్లో ప్రభాస్ మొదటి స్థానంలో ఉంటాడు అని చెప్పవచ్చు. కేవలం టాలీవుడ్ స్థాయిని మాత్రమే కాకుండా ఇండియా మొత్తంలో అత్యధిక మార్కెట్ క్రియేట్ చేసుకున్న అగ్ర హీరోల్లో ఒకరిగా మారిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ సినిమాలలో కొన్ని హాలీవుడ్ ఇండస్ట్రీ వరకు వెళ్లే అవకాశం ఉన్నట్లు అనేక రకాల కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే.అంతేకాకుండా కొంతమంది హాలీవుడ్ ప్రముఖులు కూడా ప్రభాస్ తో సినిమాలు చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు అనిపిస్తోంది. అయితే ఇంతవరకు ఆ విషయంపై ఎవరు కూడా అఫీషియల్ గా అయితే క్లారిటీ ఇవ్వలేదు ఇక ప్రభాస్ నుంచి రాబోయే ఒక సినిమా హాలీవుడ్ ప్రపంచంలో కూడా భారీ స్థాయిలో విడుదల అవుతుంది అని ఇటీవల కృష్ణంరాజు తెలియజేయడం విశేషం. ఆ సినిమా మరేదో కాదు రామాయణ ఆధారంగా దొరికేకుతున్న ఆదిపురుష్ సినిమా అని వివరణ ఇచ్చారు.

ఇటీవల ప్రభాస్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 ఏళ్ళు అయిన సందర్భంగా రెబల్ స్టార్ అభిమానులు ప్రత్యేకంగా కృష్ణంరాజును కలుసుకున్నారు.

ఈ క్రమంలో ఆయన ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి హాలీవుడ్ వరకు వెళుతున్నాడు అని త్వరలోనే రాబోయే ఆదిపురుష్ సినిమా ఇంగ్లీషులో కూడా విడుదల చేయబోతున్నట్లు వివరణ ఇచ్చేశారు. ఇదివరకే విషయంలో చాలా రకాల వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ కూడా నిజం కాదేమో అని అనుకున్నారు.

కానీ ఇప్పుడు ఏకంగా కృష్ణంరాజు వివరణ ఇవ్వడంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో సీత పాత్రలో కృతి సనన్ నటించారు.

ఇక రావణాసుడు క్యారెక్టర్ లో టాలెంటెడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి భారీ స్థాయిలో పాన్ వరల్డ్ మూవీగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.