Begin typing your search above and press return to search.

ఈ హీరో కొత్తమూవీ అట్టర్ ప్లాప్.. లిస్టులో చేరబోతుందా..??

By:  Tupaki Desk   |   11 Jan 2021 11:30 PM GMT
ఈ హీరో కొత్తమూవీ అట్టర్ ప్లాప్.. లిస్టులో చేరబోతుందా..??
X
ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో.. సినిమాలు చూసే ప్రేక్షకులలో చాలా మార్పులు వచ్చేసాయి. ఎలాంటి మార్పులంటే.. ఒకప్పుడు బంధాలు, బంధుత్వాలు అంటూ సాగే సినిమాలను ఆదరించిన ప్రేక్షకులు, ఇప్పుడు అలాంటి వాటిని దేకడం కూడా మానేశారు. అలా అని సినిమాలు తీసే దర్శకనిర్మాతలు తక్కువేం కాదు.. వాళ్లు కూడా ఫ్యామిలీ, ఎమోషన్స్ లాంటివి పక్కన పెట్టేసి చాలకాలం అయింది. అయితే కమర్షియల్ స్టోరీలు లేదా యూత్ ఎలిమెంట్స్.. ఇవి మాత్రమే ఈరోజుల్లో జనాలు, మేకర్స్ పడిపడి తీసేది, చూసేది. అలా చాలా ఫ్యామిలీ, అనుబంధాలు, బాంధవ్యల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు అటకెక్కేసాయి. పెళ్లిచూపులు లాంటి సినిమా ఇప్పుడు తీస్తే చూస్తారనే గ్యారంటీ లేదు. కానీ ఇప్పుడు ఏ హీరో అయినా 'అర్జున్ రెడ్డి' లాంటి సినిమా తీస్తే బంపర్ హిట్ అయిపోతుంది. అలాంటి మార్పులు ఇండస్ట్రీలో వచ్చేసాయి.

ఇదివరకే ఒక స్టార్ హీరో తన సొంత నిర్మాణంలో బంధాలు, ఫ్యామిలీ అంటూ 'సీతమ్మ వాకిట్లో' లాంటి సినిమా తీసి రిలీజ్ చేసాడు. కానీ ఏం జరిగింది తీరా విడుదలయ్యాక అట్టర్ ప్లాప్. అప్పుడే అర్థమైంది హీరోలు, దర్శకులకు ఇక ఫ్యామిలీ సెంటిమెంట్స్ వర్కౌట్ కావు అని. కానీ తాజాగా మరో మిడిల్ క్లాస్ హీరో అలాంటి ప్రయోగమే చేయబోతున్నాడట. ఇప్పటివ‌ర‌కు ఫ్యామిలీ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ సినిమాలు చేసిన హీరో.. ఓ కంప్లిట్ ఫ్యామిలీ స్టోరీతో సినిమా చేస్తున్నాడట. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అదేకోవకు చెందుతుందని అంటున్నారు. ప్ర‌స్తుతం జ‌నాలు ఫ్యామిలీ, సంప్ర‌దాయం, పెళ్లి ఇలాంటి టైపు క‌థ‌ల‌కు నో చెప్పేసారు. తాజాగా విడుదల చేసిన ఆ హీరో కొత్త సినిమా పోస్టర్ కూడా రిస్క్ చేసిందని చెప్పాలి. ఈ మధ్య ఎలాంటి సినిమాలు చేసినా.. ఇలాంటి వీడియోలు యూట్యూబ్ లో సంచులు కొద్దీ దొరుకుతాయ‌నే భావన ప్రేక్షకులలో కూరుకుపోయింది. మరి ఆ హీరో మూవీ కూడా అట్టర్ ప్లాప్ లిస్టులో చేరుతుందా.. చూడాలి మరి ఏం జరగనుందో..!!