Begin typing your search above and press return to search.

ఈ మార్చి వెరీ ఇంట్రెస్ట్.. ఆ నాలుగు సినిమాలు రెడీ

By:  Tupaki Desk   |   6 Feb 2023 8:00 AM GMT
ఈ మార్చి వెరీ ఇంట్రెస్ట్.. ఆ నాలుగు సినిమాలు రెడీ
X
ఈ ఏడాది కూడా ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ గా సంక్రాంతి సినిమాల జాతర ముగిసిన విషయం తెలిసిందే. ఇక ఫిబ్రవరి సినిమాలు కూడా రిలీజ్ కి రెడీ అయిపోయాయి. ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతూ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాయి. కానీ ఈ నెలలో చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ రావట్లేదనే చెప్పాలి. అయితే మార్చిలో మాత్రం కొన్ని ఆసక్తికర సినిమాలు సాహసం చేసి రిలీజ్ కు రెడీ అయ్యాయి.

సాధారణంగా మార్చి నెలలో సినిమాలు పెద్దగా రిలీజ్ కావు. ఎందుకంటే మార్చ్ నెలలో పరీక్షలు మొదలవుతాయి. స్టూడెంట్స్ చదువుతో బిజీ అయిపోతారు. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియోటర్స్ కి ఎక్కువ రారు. ఓన్లీ యూత్ అండ్ మాస్ ఆడియన్స్ మాత్రమే హాళ్లకు పరుగులు తీస్తారు. మిగతా వర్గాల ప్రేక్షకులు అంతగా రాకపోవచ్చు. అయితే సౌత్ ఇండస్ట్రీలో ఒక్కో చిత్ర సీమ నుంచి ఒక్కో ఇంట్రెస్ట్ సినిమా మార్చి నెలలో విడుదలకు సిద్ధమయ్యాయి. వాటిని చూసేందుకు ప్రేక్షకులు కూడా చాలాకాలంగా ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

ఇందులో టాలీవుడ్ నుంచి దసరా మూవీ. మార్చి 30 న రిలీజ్ కానుంది. అంటే సుందరానికి సినిమాతో హిట్ అందుకున్న నాచురల్ స్టార్ నాని దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాతో ఒక విభిన్నమైన మాస్ పాత్రలో కనిపించనున్నాడు. ఇంతకుముందు ఎప్పుడు చూడనివిధంగా నాచురల్ స్టార్ లుక్ ఉండనుంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీకాంత్ ఓదెల అనే ఒక కొత్త డైరెక్టర్ ఈ సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతున్నాడు. కీర్తి సురేష్ నాని సరసన నటించనుంది. సింగరేణి బొగ్గు గని బ్యాక్ డ్రాప్ తో రానుంది.

మానాడు విజయంతో మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కారు తమిళ హీరో శింబు. గతేడాది విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. అయితే అదే జోష్‌ను శింబు తన తదుపరి సినిమాలో కంటిన్యూ చేయలేకపోయాడు. ఇటీవలే ఈయన నటించిన ది లైఫ్‌ ఆఫ్‌ ముత్తు రిలీజై బాక్సాఫీస్‌ దగ్గర పరాజయం పాలైంది. అయితే ప్రస్తుతం స్టూడీయో గ్రీన్‌ ప్రొడక్షన్‌లో పతు తలా చిత్రంలో నటించారు. దీని పైనా ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఇది కూడా మార్చి నెలలోనే రిలీజ్ కానుంది.

కన్నడ స్టార్ హీరో ధనుంజయ్ నటించిన కొత్త చిత్రం హొయసల. ఈయన తెలుగులో పుష్ప జాలి రెడ్డి గా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రేజే తో ఆయన హొయసల చిత్రాన్ని మర్చి 30న విడుదల చేయనున్నారు. అమృత హీరోయిన్. విజయ్ ఎన్ దర్శకుడు.

చిన్న సినిమాగా వచ్చి దక్షిణాదిన భారీ విజయం సాధించిన చిత్రం ఖైది. కార్తీ కథానాయకుడిగా నటించాడు. అజయ్‌ దేవ్‌గణ్‌ హీరోగా ఈ చిత్రం హిందీలో రీమేక్‌ అవుతున్న విషయం తెలిసిందే. టైటిల్‌ భోలా. టబు ప్రధాన పాత్రలో కనిపించనుంది. ధర్మేంద్ర శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 30న విడుదల కానుంది. రూ.800 కోట్ల కుంభకోణంలో జైలు శిక్ష పడిన వ్యక్తిగా అజయ్‌ ఈ సినిమాలో కనిపిస్తాడు. బాలీవుడ్‌కి తగినట్లు మాతృక లోని కథకు కొన్ని మార్పులు చేసినట్టుగా తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.