Begin typing your search above and press return to search.

మిల్కీతో మాంసాహారం మాన్పించిన పుస్త‌కం

By:  Tupaki Desk   |   25 Jan 2020 1:47 PM GMT
మిల్కీతో మాంసాహారం మాన్పించిన పుస్త‌కం
X
కొంద‌రిని చూడ‌గానే పుస్త‌కాల పురుగు అని చెప్పొచ్చు. అలాంటి జాబితాలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరు ముందు వ‌రుస‌లో ఉంటుంది. మ‌న ద‌ర్శ‌కుల్లో క్రిష్ .. త్రివిక్ర‌మ్ లాంటి వాళ్లు పుస్త‌కాల పురుగులు. సినిమాలు చ‌దువుతారు(స్ట‌డీ).. అంత‌కుమించి పుస్త‌కాలు చ‌దువుతారు వీళ్లంతా.

ఇక పుస్తకాలు చ‌ద‌వ‌డంలో మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా స‌న్నివేశ‌మేంటి? ఈ విష‌యం త‌న‌నే ప్ర‌శ్నిస్తే.. ఏమందో తెలుసా? త‌న‌కు పుస్త‌కాలు చ‌ద‌వ‌డం అంటే ఇష్ట‌మే. కానీ బిజీ లైఫ్ వ‌ల్ల పుస్త‌కానికి దూర‌మైపోయాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అంతేకాదు త‌న లైఫ్ ని మార్చేసిన ఓ రెండు పుస్త‌కాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకొచ్చింది.

ప్ర‌స్తుతం నేను ఆధ్యాత్మికతలో ఉన్నాను. అందుకు కార‌ణం `ఓషో`. ఆ పేరు చదివితే చాలు.. అది నా జీవితానికి మేలి మ‌లుపు లాంటిది. ఆధ్యాత్మికతను బాగా అర్థం చేసుకోవడానికి ఆ పుస్త‌కం నాకు సహాయపడింది. నా జీవనశైలి పై విపరీతమైన ప్రభావాన్ని చూపిన మరో పుస్తకం రోరే ఫ్రీడ్‌మాన్ అండ్ కిమ్ బర్నౌయిన్ రాసిన `స్కిన్నీ బిచ్`. ఆ పుస్తకం చదివిన తర్వాతే నేను మాంసాహారం మానేశాను. శాఖాహారం తినడానికి ప్రేరేపించిన పుస్త‌కం అది! అని కొన్ని క‌ఠోర స‌త్యాల్ని తెలిపింది.

2019 లో ఎఫ్ 2 - సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రాల్లో న‌టించిన మిల్కీ బ్యూటీకి న‌టిగా మంచి పేరొచ్చింది. సంక్రాంతి బ‌రిలో నిలిచిన‌ స‌రిలేరు నీకెవ్వ‌రులో స్పెష‌ల్ పార్టీ సాంగ్ తో ఆకట్టుకుంది. అలాగే ఇప్ప‌టికే పెండింగులో ఉన్న ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి రిలీజ్ కోసం వేచి చూస్తోంది. గోపిచంద్ 28వ సినిమాలోనూ నాయిక‌గా ఎంపికైంది. బోలే చుడియాన్ అనే హిందీ చిత్రంలోనూ న‌టిస్తోంది.