Begin typing your search above and press return to search.
బ్రహ్మానందంలా ఈయన్నీ బయట చూసి నవ్వుతున్నారా?
By: Tupaki Desk | 31 May 2023 5:00 PMహాస్యబ్రహ్మా బ్రహ్మానందం వెండి తెరపై నవ్వించే పాత్రలు ఎన్నో పోషించారు. ఆ పేరులోనే ఓ తెలియని ఆనందం ఉంది. ఎంతమంది కమెడియన్లు వచ్చినా? బ్రహ్మానందం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. ఇక ఎప్పుడైనా బ్రహ్మానందం బయట కనిపించినా? ప్రేక్షకులు ఆయన్ని చూసి నవ్వడం అన్నది అంతే సహజంగా జరుగుతుంది.
వెండి తెరపై చూసిన బ్రహ్మానందాన్ని తెర వెనుక చూసే సరికి ఆయన పాత్రలు గుర్తొచ్చి నవ్వుకోవడం సహజంగా చోటు చేసుకుంటుంది. అయితే ఈ విషయంలో బ్రహ్మానందం కాస్త అసంతృప్తిని వ్యక్తం చేసిన సందర్భం ఉంది.
'సినిమాల్లో చూసి నవ్వుకున్నారంటే! అర్ధముంది. కానీ బయట కూడా నవ్వుతున్నారు. నేను తెర పై మాత్రమే నటుడ్ని..తెర వెనుక కాదని' ఓ సందర్భాలో అన్నారు. ఇదంతా ఇప్పుడెందుకు అనుకుంటు న్నారా? తాజాగా ఓ నటుడి విషయంలో కూడా ఇలాంటి సన్నివేశమే కనిపిస్తుంది. 'పలాస'..'ఘాజీ'..'టక్ జగదీష్'..'మసూద' లాంటి చిత్రాల్లో నటించిన తిరువూర్ సుపరిచితుడే.
వైవిథ్యమైన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఇప్పుడాయన ప్రధాన పాత్రలో 'పరేషాన్' చిత్రం తెరకెకకింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా తను అనుభవాల్ని మీడియాతో పంచుకున్నాడు.
'మసూద' సీరియస్ కథ అయినా సినిమాలో నా పాత్ర అందర్నీ నవ్వించింది. ఆ తర్వాత బయట ఎవరూ చూసినా నవ్వడం మొదలు పెట్టారు. మొదట్లో ఎందుకు నవ్వుతున్నారో? అర్దం కాలేదు. తర్వాత నా పాత్ర కారణంగానే నవ్వుతున్నారని అర్ధమైంది. మొదట్లో కాస్త ఫీలయ్యాను. తర్వాత ఆ పాత్ర వచ్చిన గుర్తింపుతోనే కదా! నవ్వారని అర్దం చేసుకున్నారు. 'పరేషాన్' చిత్రంలో ఇంకా నవ్వుకుంటారు. ఇందులో ప్రతీ పాత్రకి ఏదో ఒక పరేషాన్ ఉంటుంది.
అందుకే టైటిల్ గా పరేషాన్ అని పెట్టాం. సహజంగా పాత్రలు అమాయకత్వం నుంచి పుట్టిన హాస్యంతో రూపొందించిన చిత్రమిది. నేచురల్ హాస్యానికి ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ అవుతారు. కరోనా మొదలైన దగ్గర నుంచి పూర్తయ్యే వరకూ సినిమా చేస్తూనే ఉన్నాం. 20నెలలు కేవలం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసాం' అని అన్నారు.