Begin typing your search above and press return to search.

ధనుష్ మరో షాకింగ్ క్యారెక్.. న్యూ ఫుడ్ డెలివరీ బాయ్!

By:  Tupaki Desk   |   8 Aug 2022 12:10 PM GMT
ధనుష్ మరో షాకింగ్ క్యారెక్.. న్యూ ఫుడ్ డెలివరీ బాయ్!
X
టాలెంటెడ్ నటుడు ధనుష్ తన మార్కెట్ ఎంత పెరిగిన స్టార్ హోదా ఏ లెవెల్ కు వెళ్ళినా కూడా ఎల్లప్పుడూ ఒకే తరహాలో ఆలోచించే విధంగా ఉంటాడు. కంటెంట్ విషయంలో కొత్తగా ఆలోచించినా కూడా అనవసరమైన ఎలివేషన్స్ కు వెళ్లడు అని అందరికీ తెలిసిన విషయమే. వెంటనే ఒక పెద్ద సినిమా చేసి మళ్లీ ఆ తర్వాత ఊహించిన విధంగా ఒక చిన్న సినిమా చేయడం అతనికి చెల్లుతుంది.

అంతేకాకుండా అతను ఎంచుకునే పాత్రలు కూడా చాలా ప్రయోగాత్మకంగా ఉంటాయి. స్టార్ హోదాను ఏ మాత్రం పట్టించుకోకుండా ధనుష్ నటుడిగా స్థాయిని పెంచే పాత్రలను మాత్రమే సెలెక్ట్ చేసుకునేందుకు ఆసక్తిని చూపిస్తూ ఉంటాడు. ఇక ఇటీవల అతను ఏకంగా ఒక డెలివరీ బాయ్ పాత్రలో నటించడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆ కొత్త సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా విడుదలవగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తిరుచిత్రాంబ‌ళం అనే సినిమా చేస్తున్న ధనుష్ అందులో ఒక ఫుడ్ డెలివరీ బాయ్ గా కనిపించబోతున్నాడు. మిత్రన్ జవహర్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఆ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు నిత్యామీనన్, ప్రియా భవాని శంకర్, రాశికన్నా ముగ్గురు విభిన్నమైన పాత్రలో ఆకట్టుకోబోతున్నారు.

అయితే ఇటీవల కాలంలో ది గ్రే మ్యాన్ అనే హాలీవుడ్ సినిమా చేసినప్పటికీ కూడా ధనుష్ మళ్లీ ఇలాంటి డిఫరెంట్ పాత్రను సెలెక్ట్ చేసుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది.

ఇక ఇదే సినిమాలో లెజెండరీ డైరెక్టర్ భారతి రాజా కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఇక ప్రకాష్ రాజ్ తండ్రిగా పోలీస్ క్యారెక్టర్ లో కనిపించాడు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ఈ సినిమా ట్రైలర్ను చూస్తే అర్థమవుతుంది.

ఇక ఫైనల్గా సినిమాను ఈనెల 18వ తేదీన విడుదల చేయబోతున్నారు. మరి సినిమా ఎలాంటి రిజల్ట్ ను అంసుకుంటుందో చూడాలి. మరోవైపు తెలుగులో ధనుష్ సార్ అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసింది.