పవన్ కళ్యాణ్ సుజిత్ ఓజీపై అవన్నీ రూమర్స్ అంట

Tue Jan 31 2023 16:00:01 GMT+0530 (India Standard Time)

They are all rumors about Pawan Kalyan and Sujith OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అనే టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. షార్ట్ కట్ లో ఓజీ అని అఫీషియల్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన ఓపెనింగ్ వేడుక సోమవారం గ్రాండ్ గా జరిగింది. పవన్ కళ్యాణ్ ఈ వేడుకలో పాల్గొన్నాడు. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ దర్శకుడిగా తమన్ ఫైనల్ అయ్యాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.అయితే ఈ మూవీలో సాంగ్స్ ఫైట్స్ అస్సలు ఉండవు అనే ప్రచారం గత కొద్ది రోజుల నుంచి వినిపిస్తుంది. కాన్సెప్ట్ బేస్డ్ గా ఈ మూవీ ఉండబోతుంది అని టాక్ నడిచింది. అయితే పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్ ముందుగా కోరుకునే సాంగ్స్ ఫైట్స్ అనే సంగతి అందరికి తెలిసిందే. పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తే చూడాలని అందరూ భావిస్తూ ఉంటారు. అయితే సుజిత్ మూవీలో ఆ రెండు లేవని చెప్పేసరికి ఫ్యాన్స్ కొంత వర్రీ అయ్యారని చెప్పాలి. అయితే సోషల్ మీడియాలో సినిమాపై సర్క్యులేట్ అయిన కథనాలు అన్ని కేవలం రూమర్స్ మాత్రమే అని తెలుస్తుంది.

ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారని అలాగే 6 సాంగ్స్ కూడా ఉన్నాయని చిత్ర వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. అందుకే తమన్ ని మ్యూజిక్ కోసం తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే మల్టీపుల్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉండబోతున్నాయని ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది. ఓ విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పంజా మూవీకి అడ్వాన్స్ వెర్షన్ గా సుజిత్ మూవీ ఉండబోతుంది అని టాక్. కచ్చితంగా ఈ మూవీ పవర్ స్టార్ అభిమానులు అందరూ కూడా కలర్ ఎగరేసుకోవచ్చు అనే మాట వినిపిస్తుంది.

పవన్ కళ్యాణ్ మేగ్జిమమ్ రీమేక్ కథలనే ఈ మధ్యకాలంలో చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో సుజిత్ మూవీ కూడా రీమేక్ కాన్సెప్ట్ గానే ఉండబోతుంది అనే ప్రచారం కూడా నడిచింది. అయితే పోస్టర్ తోనే ఇది తన ఒరిజినల్ స్క్రిప్ట్ అని సుజిత్ అందరికి క్లారిటీ ఇచ్చాడు. మరి రెండు రీమేక్ ల తర్వాత పవన్ చేస్తున్న స్ట్రైట్ సబ్జెక్ట్ మూవీ ప్రేక్షకులని ఏ మేరకు మెప్పిస్తుంది అనేది చూడాలి. సాహో లాంటి హిట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని సుజిత్ రాసుకున్న సినిమా కావడంతో ఒక ఫ్యాన్ బాయ్ గా కచ్చితంగా అందరికి నచ్చే కథనే అందిస్తాడని భావిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.