Begin typing your search above and press return to search.
ఇండియాని షేక్ చేసిన నేటి తరం స్టార్ మేకర్స్ వీళ్లే!
By: Tupaki Desk | 29 March 2023 6:00 AMదక్షిణాది పరిశ్రమ ట్రెండ్ మార్చింది. ఇప్పుడు సౌత్ నుంచి సినిమా? వస్తుందంటే? ఇండియా మొత్తం షేక్ అవ్వాల్సిందే! అన్న రేంజ్ లో సౌత్ మేకర్స్ క్రియేటివిటీ కనిపిస్తుంది. స్క్రిప్ట్ పై లోతైన విశ్లేషణ. పాత్రల పరంగా ఎంపిక. స్టోరీ ఇన్నోవేషన్. ఇలా ప్రతీది డైరెక్టర్ విజన్ కి తగ్గట్టు మలుచుకోవడం వంటివి కీరోల్ పోషిస్తున్నాయి. నాలుగు ఫైట్లు..పాటలు పెట్టి సినిమా చేద్దాం? అనే రోజులకు ఈ నయా మేకర్స్ అంతా చెక్ పెట్టేసారు. సీనియర్లు..సూపర్ సీనియర్లని అందర్నీ క్రాస్ చేసి ఈ నయా మేకర్లు సినిమా అనే జిందగీనే ఏల్తున్నారు.
టాప్ స్టార్లు అంతా పాన్ ఇండియా సక్సెస్ ఫుల్ దర్శకులపైనే పడుతున్నారు. ఈ పోటీ సౌత్ నుంచే కాదు ఉత్తరాది నుంచి కూడా గట్టిగానే ఉంది. మరి పరిశ్రమలో ఇంతగా మార్పు తీసుకొచ్చిన ఆ నయా మేకర్స్ ఎవరు? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
'బాహుబలి'..`ఆర్ ఆర్ ఆర్` విజయాలతో రాజమౌళి ప్రతిభ దేశ సరిహద్దులే దాటి పోయింది. ఇప్పుడాయన పాన్ వరల్డ్ లో ఫేమస్ అవుతున్నారు. ఇటీవలే ఆస్కార్ కూడా అందుకోవడంతో! ఆయన రేంజ్ పూర్తిగా మారిపోయింది. జక్కన్నతో ఒక్క సినిమా అయినా చేయాలని అన్ని పరిశ్రమలో నటులు ఆశపడుతున్నారు.
ఆ తర్వాతి స్థానంలో `కేజీఎఫ్` ప్రాంచైజీ తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ ఉన్నారు. `కేజీఎఫ్` హిట్ ఆయన్ని పాన్ ఇండియాలో ఫేమస్ చేసింది. ఓచిన్న సినిమాతో లాంచ్ అయిన ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ ఉప్పెనలా దూసుకొచ్చాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వసూళ్లు! నీల్ రేంజ్ ని అంతకంతకు రెట్టింపు చేసాయి.
ఇక మరో క్రియేటివ్ మేకర్ సుకుమార్ `పుష్ప` పాన్ ఇండయా సక్సెస్ తో! `పుష్ప-2`ని అంతర్జాతీయ స్థాయిలోనే తెరకెక్కిస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన సినిమా హిందీ బాక్సాఫీస్ ని రప్ఫాడించేసింది. దీంతో సుకుమార్ రెండవ భాగానికి సంబంధించి స్క్రిప్ట్ ని ఇంటర్నేషనల్ కి రీచ్ అయ్యేలా రీ-డిజైన్ చేసి బరిలోకి దిగారు.
అలాగే కోలీవుడ్ యువ కెరటం లోకేష్ కనగరాజ్ `ఖైదీ`-విక్రమ్ సక్సెస్ తో తనకంటూ ఓ యూనివర్శ్ ఉందని క్రియేట్ చేసుకున్నాడు. ఇండియాలో ఇంత వరకూ ఏ మేకర్ ఇలాంటి ఆలోచనతో ముందుకు రాలేదు. దీంతో లోకేష్ పాన్ ఇండియా వైడ్ ఫేమస్ అవుతున్నారు.
ఇక మరో తెలుగు సంచలనం చందు మొండేటి! అనన్య సామాన్యుడని `కార్తికేయ-2`తో నిరూపించారు. తనలో యూనిక్ ఐడియాలజీని ఈ సినిమాతో వర్కౌట్ చేయగలిగారు. సెన్సిబుల్ స్టోరీని కమర్శియల్ యాస్పెక్ట్ లో పాన్ ఇండియాకి కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయిన మేకర్. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయినా ఈ సినిమా పాన్ ఇండియా లో అతి పెద్ద సక్సెస్ సాధించింది. దీంతో సీక్వెల్ ని అంతర్జా తీయ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.
మరో కన్నడం సంచలనం `కాంతార` తో కనక వర్షం కురిపించిన రిశబ్ శెట్టి క్రేజ్ పీక్స్ లో ఉంది. యంగ్ మేకర్ కోసం బడా నిర్మాణ సంస్థలే క్యూలో ఉన్నాయి. అలాగే తమిళ దర్శకుడు అట్లీ పేరు మార్కెట్ లో జోరుగా వినిపిస్తుంది. ఆ క్రేజ్ తోనే షారుక్ ఖాన్ నే డైరెక్ట్ చేసే అరుదైన అవకాశం ఒడిసిపట్టుకున్నారు.
ఈ నయా మేకర్స్ అంతా భవిష్యత్ లో మరిన్ని వండర్స్ క్రియేట్ చేయగల సత్తా ఉన్నవారని పరిశ్రమ బలంగా విశ్వషిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.