దాస్ కా ధమ్కీలో ప్లస్ పాయింట్లు ఇవేనట!

Sat Mar 18 2023 12:22:03 GMT+0530 (India Standard Time)

These are the plus points in Das Ka Dhamki

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇతర హీరోలతో పోల్చుకుంటే విశ్వక్ సేన్ ఎవరో తెలుగు ప్రేక్షకులు అందరికీ బాగా పరిచయమే. వివాదాలతో సావాసం చేసే విశ్వక్ సేన్ దర్శకుడిగా మారి చేస్తున్న రెండో సినిమా దాస్ కా ధమ్కీ. నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఉగాది సందర్భంగా మార్చి 22వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్గా నిర్వహించారు. హైదరాబాదులోని శిల్పకళా వేదికగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా... ముఖ్యఅతిథిగా ఎన్టీఆర్ హాజరవడంతో సినిమా మీద ఒక్కసారిగా అంచనాలు పెరిగినట్లు అయింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తయింది.

ఈ నేపథ్యంలో సినిమాలోని ప్లస్ పాయింట్ ఏమిటి అనే విషయం మీద కూడా చర్చ జరుగుతోంది. ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం... ఈ సినిమాలో విశ్వక్ సేన్ పర్ఫామెన్స్ అల్టిమేట్గా ఉందని సినిమా మొత్తానికి అదే అదనపు ఆకర్షణగా నిలవబోతోందని అంటున్నారు. అలాగే యాక్షన్ సీక్వెన్స్ కూడా హాట్ టాపిక్ అవ్వబోతున్నాయని విశ్వక్ సేన్లో ఉన్న డైరెక్టర్ యాక్షన్ సీక్వెన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడని అంటున్నారు.

అయితే కామెడీ మాత్రం సో సోగా ఉంటుందని... రెండు పాటలు బాగుంటాయని అంటున్నారు. ఈ సినిమాని విశ్వక్ సేన్ సొంత బ్యానర్ వన్ మై క్రియేషన్స్ మీద స్వయంగా విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు నిర్మిస్తున్నారు. ధమాకా సినిమా చూపిస్త మావా నేను లోకల్ వంటి సినిమాలకు కథ డైలాగులు అందించిన రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడ ఈ సినిమాకి కూడా కథ అందించడంతో సినిమా మీద ప్రేక్షకులలో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. దానికి తగినట్టుగానే విశ్వక్ సేన్ కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేసుకుంటున్నాడు. బాలకృష్ణతో మొదటి ట్రైలర్ లాంచ్ చేయించడం... ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్రీ రిలీజ్ కి రావడంతో అందరి ఆసక్తి సినిమా మీదనే ఉంది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.