Begin typing your search above and press return to search.

3 రోజుల్లో `కార్తికేయ‌-2` వ‌సూళ్లు ఇవే!

By:  Tupaki Desk   |   16 Aug 2022 12:16 PM GMT
3 రోజుల్లో `కార్తికేయ‌-2` వ‌సూళ్లు ఇవే!
X
నిఖిల్ క‌థానాయకుడిగా న‌టించిన `కార్తికేయ‌-2` విజ‌య‌వంతంగా దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా కేట‌గిరిలో రిలీజ్ అయిన సినిమా అన్ని ఏరియాల్లో మంచి వ‌సూళ్ల‌ని సాధిస్తుంది. ఇక హిందీలో థియేట‌ర్ల సంఖ్య‌ని భారీగా పెంచారు. 50 థియేట‌ర్ల‌లో రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు అక్క‌డ 700 థియేట‌ర్ల‌కి స్ర్పెడ్ అయింది.

అంటే నార్త్ లో ఏ స్థాయిలో ఆడియ‌న్స్ ని ఆకట్టుకుంటుందో అంచ‌నా వేయోచ్చు. హీరో అనే ఇమేజ్ తో సంబంధం లేకుండా కేవ‌లం కంటెంట్ ప్ర‌ధానంగా దూసుకుపోతుంని చెప్పొచ్చు. ఇప్ప‌టికే సినిమా ఏపీ-తెలంగాణ‌లో బ్రేక్ ఈవెన్ సాధించింది. తాజాగా ఈ సినిమా మూడు రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్ వ‌సూళ్ల వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

మొద‌టి రెండు రోజులు క‌లెక్ష‌న్లు కాస్త నెమ్మ‌దించిన మూడ‌వ రోజు ఆగ‌స్టు 15 స్వాతంత్ర్య‌ దినోత్స‌వం రోజున సినిమా భారీగా వ‌సూళ్లు సాధించిన‌ట్లు తెలుస్తోంది. మూడు రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్ డిస్ర్టిబ్యూట‌ర్ల షేర్ 13.70 కోట్ల‌గా తేలింది. ఓసారి ఏరియాల వారిగా వ‌సూళ్లు చూస్తే..

నైజా-3.69 కోట్లు.. మొద‌టి రోజు 1.15 కోట్లు.. సీడెడ్-1.55 కోట్లు..ఫ‌స్ట్ డే0.53 కోట్లు..యూఏ-1.43 కోట్లు.. తొలి రోజు0.45 కోట్లు.. గుంటూరు 1.01 కోట్లు..తొలి రోజు 0.40 కోట్లు.. ఈస్ట్-0.92 కోట్లు.. ఫ‌స్ట్ డే-0.30 కోట్లు.. వెస్ట్ -0.64 కోట్లు..ఫ‌స్ట్ డే-0.20 కో ట్లు..కృష్ణా-0086 కోట్లు..మొద‌టి రోజు 0.27 కోట్లు.. నెల్లూరు-0.30 కోట్లు..మొద‌టి రోజు0.80 కోట్లు..మూడు రోజుల్లో తెలుగు రాష్ర్టాల నుంచి 10.40 కోట్లు సాధించ‌గా..మొద‌టి రోజు 3.38 కోట్ల వ‌సూళ్ల‌ని సాధించింది.

ఇక క‌ర్ణాట‌క‌..త‌మిళ‌నాడు నుంచి 0.65 కోట్లు..నార్త్ బెల్ట్ నుంచి 0.90 కోట్లు ..ఓవ‌ర్సీస్ నుంచి 1.75 కోట్లు..మొత్తంగా మూడు రోజుల్లో 13.70 కోట్ల గా లెక్కగా తేలింది.

హిందీలో భారీగా థియేట‌ర్ల సంఖ్య ని పెంచిన నేప‌థ్యంలో వ‌సూళ్లు భారీగా పెరిగే అవ‌కాశం ఉంది. వాస్త‌వానికి హిందుత్వం నేప థ్యంలో తెర‌కెక్కిన సినిమాల‌కు ఉత్త‌రాది రాష్ర్టాల్లో మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుంద‌ని గ‌త సినిమాల ఫ‌లితాలు కొన్ని చెప్ప‌క‌నే చెప్పాయి. తాజాగా అదే సెంటిమెంట్ ఇప్పు డు కార్తికేయ‌-2 విష‌యంలోనూ రుజువు అవుతోంది. వాటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకునే నిర్మాత‌లు థియేట‌ర్ల సంఖ్య‌ని పెంచిన‌ట్లు తెలుస్తోంది.