టాప్ స్టోరి: టాలీవుడ్ ఇంట్రావర్ట్ లతో బీకేర్ ఫుల్!

Sun Sep 20 2020 08:00:05 GMT+0530 (IST)

Top Story: Becarerful with Tollywood Introvert!

టాలీవుడ్ హీరోల్లో నేమ్ ఫేమ్ వున్న హీరోల నుంచి అప్ కమ్ హీరోల వరకు కొంత మంది ఇంట్రావర్ట్ల (అంతర్ముఖుల) జాబితాని పరిశీలిస్తే ఆసక్తికరం. వెండితెరపై అంత వైబ్రేంట్ గా అలరిస్తూనే వ్యక్తిగతంగా అంతగా చొచ్చుకుపోయే తత్వం లేని హీరోలు ఉన్నారు. అసలు తమకు వ్యక్తిగతంగా నచ్చితే గానీ మాట్లాడని హీరోలు వున్నారా? అంటే వున్నారు. జాబితా పరిశీలిస్తే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. `బాహుబలి` స్టార్ ప్రభాస్ ముందు వరుసలో ఉంటారు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఈ కోవకు చెందిన వాడే. శ్రీవిష్ణు ఈ తరహానే. ఈ హీరోల్లో ప్రధానంగా అనవసర విషయాలకు దూరంగా వుంటూ తనకు నచ్చిన వారితోనే క్లోజ్ గా వుంటూ వస్తున్నారు. శ్రీవిష్ణుకు నారా రోహిత్ క్లోజ్ ఫ్రెండ్.పవన్ కల్యాణ్ తొలి నుంచి ఎంతో విలక్షణుడు. తక్కువగానే మాట్లాడుతారు. అలాగే తన సన్నిహితులంటే ప్రాణం పెడతారు. కొత్తవారితో వెంటనే కలవలేరు. అతడితో సింక్ అవ్వడం అంత ఈజీ కాదు. టాలీవుడ్ లో వున్న వ్యక్తుల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాత్రమే స్నేహితుడన్న విషయం తెలిసిందే. ఆ తరువాత స్థానంలో నిలిచే హీరో ప్రభాస్ ఎంత దేశాన్ని ఊపేసిన `బాహుబలి` చిత్రంలో నటించినా ప్రభాస్ కు నచ్చని వారితో మాట్లాడం అంటే పెద్దగా ఇష్టం వుండదట. ఇక నచ్చినవారు అయితే డార్లింగ్ అంటూ హగ్గిచ్చేసేంత చనువుగా ఉంటాడు.

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ స్టేజ్ యాక్టివిటీస్ చూస్తే ఎంత వైబ్రేంట్ గా ఉంటాడోనని అంతా అనుకుంటారు. కానీ అతడు కూడా ఇంట్రావర్ట్ అని తనకు నచ్చితే తప్ప ఎవరితోనూ అంత ఈజీగా మింగిల్ కాలేడని సన్నిహితులు చెబుతారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రియదర్శి ఇటీవల బయటపెట్టాడు. క్లోజ్గా వుండేవారితోనే టైమ్ స్పెండ్ చేయడానికి విజయ్ ఆసక్తిని చూస్తాడట. ఇదే తరహా లో యంగ్ హీరో శ్రీవిష్ణు కొత్త వారితో మాట్లాడాలంటే సిగ్గెక్కువ. పైగా అత్యధిక శాతం ఎవరితోనూ ఆయన మాట్లాడరని అంతర్ముఖుడిగా వుంటారని తెలిసింది. ఇంకా పలువురు హీరోలు అంతర్ముఖులు ఉన్నారు.