Begin typing your search above and press return to search.

క్రేజీ హీరో యాక్ష‌న్ కి ఇంకా టైమ్ ప‌ట్టేలా వుందే!

By:  Tupaki Desk   |   26 Jun 2022 5:32 AM GMT
క్రేజీ హీరో యాక్ష‌న్ కి ఇంకా టైమ్ ప‌ట్టేలా వుందే!
X
దాదాపు నాలుగేళ్ల క్రితం మాస్ మ‌సాల యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ తో కెరీర్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకున్నాడో క్రేజీ హీరో. ఇదే సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఇస్మార్ట్ గా రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి మాస్‌ హీరోగా త‌న స‌త్తా ఏంటో చాటుకున్నాడు. అప్ప‌టి వ‌ర‌కు క్లాస్ హీరోగా, ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్ తో వున్న స‌ద‌రు హీరో మాసీవ్ బ్లాక్ బ‌స్ట‌ర్ తో మాస్ హీరోగా మారిపోయాడు. ఆ మూవీ నుంచి ఇదే మార్కు యాక్ష‌న్ సినిమాల‌కు ప్రాధాన్య‌త నివ్వ‌డం మొద‌లు పెట్టారు.

మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి నుంచి సూర్య లాంటి హీరోల వ‌ర‌కు క్రేజీ స్టార్ల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ల‌ని అందించి మాసీవ్ యాక్ష‌న్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన త‌మిళ ద‌ర్శ‌కుడితో ప్ర‌స్తుతం ఈ క్రేజీ హీరో ఓ మాసీవ్ హైవోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని చేస్తున్నారు. ప‌వ‌ర్ ఫుల్ క్యారెక్ట‌ర్ లో న‌టిస్తున్న ఈ మూవీ ఇప్ప‌టికే నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ సినిమాతో మ‌రో ప‌వ‌ర్ ఫుల్ బ్లాక్ బ‌స్ట‌ర్ ని త‌న ఖాతాలో వేసుకోవాల‌నే గ‌ట్టి న‌మ్మ‌కంతో వున్నాడు.

సినిమా ఔట్ పుట్ పై వున్న న‌మ్మ‌కంతో తొలిసారి ఈ మూవీ కోసం డిస్ట్రిబ్యూట‌ర్ గా కూడా మారుతున్నాడు. జూలై సెకండ్ వీక్ లో ఈ మూవీని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ డేట్ ని కూడా చిత్ర బృందం ప్ర‌క‌టించేసింది. ప్ర‌మోష‌న్స్ జోరుగా సాగుతున్నాయి. క్రేజీ హీరో కెరీర్ లోనే అత్యంత భారీ స్థాయిలో భారీ బ‌డ్జెట్ తో ఈ మూవీని నిర్మించారు. స‌ద‌రు హీరో న‌టిస్తున్న తొలి బై లింగ్వ‌ల్ మూవీ కూడా ఇదే కావ‌డం విశేషం.

సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఇప్ప‌టికే మూడు లిరిక‌ల్ వీడియోల‌ని విడుద‌ల చేశారు. తొలి లిరిక‌ల్ వీడియో రెండు భాష‌ల్లోనూ దుమ్ము దులిపేస్తూ యూట్యూబ్ లో రికార్డు స్థాయి వ్యూస్‌ని రాబ‌డుతూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. హీరో, హీరోయిన్ మ‌ధ్య కుదిరిని కెమిస్ట్రీ, క్రేజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అందించిన బాణీలు ఈ సాంగ్ కి మ‌రింత ప్లాస్ గా మారి ఈ లిరిక‌ల్ వీడియో ఒకేసారి రెండు భాష‌ల్లోనూ రికార్డు స్థాయి వ్యూస్‌ని రాబ‌డుతూ రికార్డులు సృష్టిస్తోంది.

ఇదిలా వుంటే క్రేజీ హీరో భారీ అంచ‌నాలు పెట్టుకున్న ఈ మూవీ జూలై సెకండ్ వీక్ లో రావ‌డం క‌ష్ట‌మ‌ని తెలుస్తోంది. ముందు అనుకున్న ప్ర‌కారం కాకుండా ఈ మూవీ రిలీజ్ మ‌రింత ఆల‌స్యం అయ్యే అవ‌కాశాలు వున్నాయ‌ని తెలుస్తోంది. కార‌ణం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ చాలా వ‌ర‌కు పెండింగ్ స్టేజ్ లోనే వుండ‌టం అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. జూలై సెకండ్ వీక్ న ఈ మూవీ రావాలంటే ఇప్ప‌టికే ఈ వ‌ర్క్ మొత్తం పూర్తి చేయాల్సి వుంది. కానీ అలా జ‌ర‌గ‌లేదు. చాలా వ‌ర్క్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ పెండింగ్ లో వుంది. దీని కార‌ణంగా స‌ద‌రు క్రేజీ హీరో మూవీ జూలై సెకండ్ వీక్ లో రావ‌డం క‌ష్ట‌మ‌ని తెలుస్తోంది.