వెరైటీగా 'తెల్లారితే గురువారం' అప్డేట్ ఇచ్చిన 'మత్తు వదలరా' హీరో..!

Tue Feb 23 2021 18:22:48 GMT+0530 (IST)

Thellavarithe Guruvaram Teaser on Feb 26th

'మత్తు వదలరా' సినిమాతో హీరోగా పరిచయమైన సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు శ్రీ సింహా కోడూరి నటిస్తున్న రెండో సినిమా ''తెల్లారితే గురువారం''. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తో మణికాంత్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. సాయి కొర్రపాటి సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం - లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై రజని కొర్రపాటి - రవీంద్ర బెనర్జీ ముప్పనేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో తాజాగా వెరైటీగా సినిమా రిలీజ్ డేట్ ని ఓ వీడియో ద్వారా అనౌన్స్ చేసిన హీరో టీజర్ అప్డేట్ ఇచ్చాడు.'తెల్లారితే గురువారం' సినిమా రిలీజ్ కోసం స్లాట్ వెతికిన హీరో మార్చి 11న 'జాతిరత్నాలు' - మార్చి19న 'చావు కబురు చల్లగా' - ఏప్రిల్ 9న 'వకీల్ సాబ్' విడుదల ఉన్నాయని ఇంకా ముందుకు వెళ్తే పెద్ద సినిమాలు ఉన్నాయని.. అందుకే మధ్యలో మార్చి 27న తన సినిమాని రిలీజ్ చేయనున్నట్లు సింహా పేర్కొన్నాడు. అలానే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని ఫిబ్రవరి 26న మధ్యాహ్నం గం. 1.24 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. ఇకపోతే ఈ చిత్రంలో శ్రీసింహా సరసన చిత్రా శుక్లా - మిషా నారంగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కీరవాణి మరో తనయుడు కాలభైరవ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ చిత్రానికి సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా.. సత్య ఎడిటింగ్ వర్క్ చేస్తున్నాడు.