పుట్టినరోజు సందర్బంగా యువహీరో కొత్త పోస్టర్ విడుదల!

Tue Feb 23 2021 11:07:48 GMT+0530 (IST)

Thellavarithe Guruvaram New poster Released

ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడుగా 'తెల్లవారితే గురువారం' అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. డార్క్ కామెడీ థ్రిల్లర్ 'మత్తు వదలరా' సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన శ్రీసింహా రెండో సినిమాగా 'తెల్లవారితే గురువారం' తెరకెక్కుతుంది. మొదటి సినిమాతోనే మంచి ఇంప్రెషన్ తెచ్చుకున్న శ్రీసింహా ఇప్పుడు రొమాంటిక్ లవ్ స్టోరీతో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈరోజు హీరో శ్రీసింహా పుట్టినరోజు సందర్బంగా చిత్రబృందం హీరో పేరు రివీల్ చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. పోస్టర్ చూస్తుంటే ఈసారి కూడా వినూత్నమైన పాయింట్ తో ఈ సినిమా రానుందట. హీరో క్యారెక్టర్ పేరు 'వీరు' అని పోస్టర్ చూస్తే అర్ధమవుతుంది. పెళ్లిబట్టలతో హీరో సిగరేట్ వెలిగిస్తూ నిలబడిన పోజు ఆకట్టుకుంటుంది.ఈ సినిమాలో శ్రీసింహా సరసన మిషా నారంగ్ చిత్రాశుక్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. నూతన దర్శకుడు మణికాంత్ గెల్లి ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమాను వారాహి చలనచిత్రం లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ల పై రజనీ కొర్రపాటి రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే మార్చి 27న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇదివరకే రిలీజ్ డేట్ పోస్టర్ కూడా విడుదల చేసింది. అందులో కారులో హీరో మరో అమ్మాయిని ఒళ్లో కూర్చోపెట్టుకుని రొమాన్స్ చేస్తుంటే మరో హీరోయిన్ పెళ్లికూతురు ఓరకంట చూస్తుంది. ఇక ఈ సినిమాకు శ్రీసింహా బ్రదర్ కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. చూడాలి మరి ఈ బ్రదర్స్ ఇద్దరూ మరోసారి మేజిక్ చేస్తారేమో!