Begin typing your search above and press return to search.

డిస్ట్రిబ్యూటర్స్ కి మొండి చేతులు చూపిస్తున్న ప్రొడ్యూసర్స్...!

By:  Tupaki Desk   |   14 Oct 2020 12:30 AM GMT
డిస్ట్రిబ్యూటర్స్ కి మొండి చేతులు చూపిస్తున్న ప్రొడ్యూసర్స్...!
X
కరోనా లాక్‌ డౌన్‌ సడలింపుతో సినిమా పరిశ్రమలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌ లు మొదలవుతున్నాయి. అక్టోబర్ 15 తర్వాత 50 శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్స్ మల్టీప్లెక్సులు తేర్చుకోడానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలకు అనుగుణంగా త్వరలోనే థియేటర్లు తెరుచుకోనున్నాయి. దీంతో కొత్త సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతాయి.. గత ఏడు నెలలుగా తీవ్ర నష్టాలు చవిచూస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ మరియు ఎగ్జిబిటర్స్ బయటపడతారు అని అందరూ అనుకున్నారు. అయితే టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ మాత్రం డిస్ట్రిబ్యూటర్స్ - ఎగ్జిబిటర్స్ కి మొండి చేతులు చూపిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అక్టోబర్ 15 తర్వాత థియేటర్స్ ఓపెన్ చేసుకోమని కేంద్రం చెప్పినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో దసరా లేదా దీపావళి ఫెస్టివల్ సీజన్ కి ఓపెన్ చేయాలని సన్నాహకాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ప్రొడ్యూసర్స్ మాత్రం తమ సినిమాలను రిలీజ్ చేయడానికి ముందుకు రావడం లేదట. దీనికి కారణం రాబోయే రెండు మూడు నెల‌ల్లో థియేట‌ర్స్ లో సినిమాను విడుద‌ల చేస్తే కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందో లేదో అని నిర్మాతలు భ‌యపడటమే అని తెలుస్తోంది. ఆల్రెడీ కంప్లీట్ అయిన సినిమాల మేకర్స్ ని సంప్రదించి దీపావ‌ళికి మూవీని రిలీజ్ చేయాల్సిందిగా డిస్ట్రిబ్యూటర్స్ అడుగుతున్నారట. అయితే మేకర్స్ మాత్రం మా సినిమా షూటింగ్ పార్ట్ ఇంకా మిగిలి ఉంద‌ని.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తవడానికి సమయం పడుతుందని చెప్తున్నారట. ఏదేమైనా క‌రోనా మహమ్మారి కార‌ణంగా సినీ ఇండ‌స్ట్రీలో బాగా న‌ష్ట‌పోయిన వారిలో పంపిణీదారులు - ఎగ్జిబిటర్స్ ముందు వరుసలో ఉంటారన్నది వాస్త‌వం.