Begin typing your search above and press return to search.

2022-23 సంవత్సరాలు మెగా ఫ్యాన్స్ కు చాలా స్పెషల్‌

By:  Tupaki Desk   |   20 Jan 2022 2:30 AM GMT
2022-23 సంవత్సరాలు మెగా ఫ్యాన్స్ కు చాలా స్పెషల్‌
X
ఈమద్య కాలంలో స్టార్‌ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేస్తేనే గొప్ప విషయం అన్నట్లుగా పరిస్థితి ఉంది. అలాంటిది రెండు సినిమాలు చేస్తే మా హీరో గ్రేట్‌ అంటూ అభిమానులు సంకలు గుద్దేసుకుంటున్నారు. ఇక మూడు సినిమాలు చేస్తే దేవుడు అంటున్న రోజులు ఇవి. అలాంటిది రాబోయే రెండేళ్లలో మెగా స్టార్‌ చిరంజీవి నుండి ఏకంగా ఏడు సినిమాలు రాబోతున్నాయి. ఏడు సినిమా లకు ఒకటి ఎక్కువే కాని తక్కువ కాకుండా చిరంజీవి ఈ ఏడాది వచ్చే ఏడాది కలిపి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉండి వాయిదా పడ్డ ఆచార్య మొదలుకుని ఇంకా మొదలు కాని మారుతి మరియు వెంకీ కుడుముల సినిమాల వరకు చిరంజీవి చేయబోతున్న సినిమాలన్నీ కూడా ఈ ఏడాది మరియు వచ్చే ఏడాదికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

ఈ ఏడాది లో ఆచార్య విడుదల కాబోతుంది. ఆచార్య చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన విషయం తెల్సిందే. చిరంజీవి ఇప్పటికే గాడ్‌ ఫాదర్‌.. భోళా శంకర్‌ మరియు వాల్తేరు వాసు సినిమాలను మొదలు పెట్టాడు. ప్రస్తుతం షూటింగ్‌ జరుగుతున్న సినిమాల్లో ఒకటి లేదా రెండు సినిమాలు అయినా ఈ ఏడాది విడుదల అవ్వబోతున్నాయి. ఆచార్య సినిమా ఈ సమ్మర్‌ లో విడుదల కాబోతుంది. కనుక దసరాకు మెగా స్టార్‌ మూవీ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏ సినిమాకు అయినా మూడు నాలుగు నెలల కంటే ఎక్కువ సమయం కేటాయించాలని చిరంజీవి భావించడం లేదు. ఆచార్య సినిమా ను కూడా వంద వర్కింగ్‌ డేస్ లో పూర్తి చేయాలని చిరంజీవి అనుకున్నాడు. కాని కరోనా ఇతర కారణాల వల్ల సినిమా షూటింగ్‌ పూర్తి అయినా కూడా విడుదలకు నోచుకోవడం లేదు.

ఆచార్య సినిమా తర్వాత రాబోతున్న సినిమాల జాబిత చెప్తే మెగా అభిమానులకు పూనకాలే అనడంలో సందేహం లేదు. గాడ్ ఫాదర్ సినిమా ముగింపు దశకు వచ్చింది కనుక ఆచార్య తర్వాత ఆ సినిమాను విడుదల చేస్తారని అంటున్నారు. గాడ్ ఫాదర్ చిత్రం తర్వాత బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతో చిరంజీవి వస్తాడని అంటున్నారు. ఆ తర్వాత మెహర్‌ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ సినిమా కూడా విడుదల కాబోతుంది. ఇదే సమయంలో మారుతి.. వెంకీ కుడుముల మరియు అనీల్ రావిపూడి దర్శకత్వంలో కూడా చిరంజీవి కూడా సినిమాలును చేయబోతున్నాడు. ఈ మొత్తం సినిమాలు రాబోయే రెండేళ్లలోనే రాబోతున్నాయి. కనుక ఈ రెండేళ్లు మెగా ఫ్యాన్స్ కు చాలా స్పెషల్ అనడం లో సందేహం లేదు. ఈ రెండేళ్లలో చిరంజీవివి ఏడు సినిమాలు మాత్రమే కాకుండా రామ్‌ చరణ్.. అల్లు అర్జున్‌.. సాయి ధరమ్‌ తేజ్.. వైష్ణవ్‌ తేజ్ మరియు ఇతర మెగా హీరోల సినిమాలు కూడా చాలానే వస్తాయి. కనుక రాబోయే రెండేళ్లలో మెగా మూవీస్ జాబిత చూస్తే అంతా షాక్ అయ్యే రేంజ్ లో ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.