సెన్సేషనల్ టైటిల్ ని లాక్ చేసిన `ఉప్పెన` హీరో!

Sun Feb 28 2021 10:30:24 GMT+0530 (IST)

The 'uppena' hero who locked the sensational title!

అవును.. ఉప్పెన చిత్రంతో సెన్సేషనల్ హిట్టందుకున్న వైష్ణవ్ తేజ్ .. ఇప్పుడు తన రెండో సినిమాకి అంతే సెన్సేషనల్ టైటిల్ ని లాక్ చేశాడు. ఆ మేరకు దర్శకుడు క్రిష్ వద్ద స్పష్ఠమైన సమాధానం ఉందని తెలిసింది.రకుల్ ప్రీత్ - వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రల్లో క్రిష్ తెరకెక్కిస్తున్న తాజా మూవీ టైటిల్ ఫిక్సయ్యిందని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ సినిమాకి కొండపొలం అనే టైటిల్ ని ఫైనల్ చేశారని ఇంతకుముందు ప్రచారం సాగింది.

కానీ క్రిష్ బృందం ఆలోచన మారిందట. `జంగిల్ బుక్` అనే టైటిల్ ని లాక్ చేసారనేది తాజా సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మహమ్మారీ లాక్ డౌన్ సమయంలో ఈ చిత్రం ప్రధానంగా హైదరాబాద్ - వికారాబాద్ అడవుల్లో చిత్రీకరించారు.

ప్రస్తుతం ఈ సినిమా టాకీ చిత్రీకరణ పూర్తయి నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి. ఈ సినిమా కథాంశంతో పాటు.. వీఎఫ్ ఎక్స్ కూడా మెస్మరైజ్ చేస్తుందని సమాచారం. ఆగస్టులో సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రముఖ రచయిత సన్నాపురెడ్డి వెంకట్రామి రెడ్డి ప్రశంసలు పొందిన పుస్తకం `కొండపోలం` ఆధారంగా రూపొందింది.