అమ్మ అంజనమ్మతో త్రిమూర్తులు

Sat Jan 29 2022 20:00:01 GMT+0530 (IST)

The trinity with Amma Anjanamma

మెగాస్టార్ చిరంజీవి మరోసారి కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో ఆయన క్వారెంటైన్ వుంటూ డాక్టర్ల సలహాలు పాటిస్తూ చికిత్స పొందుతున్నారు. అయితే  మదర్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా చిరంజీవి ట్వీట్ చేసిన చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ రోజు మెగాస్టార్ మాతృమూర్తి అంజనా దేవి పుట్టిన రోజు. అయితే కోవిడ్ కారణంగా తాను తన తల్లిని కలవలేకపోతున్నానని విచారం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా `అమ్మా నీకు జర్మదిన శుభాకాంక్షలు. క్వారెంటైన్‌లో వున్న కారణంగా ప్రత్యక్షంగా కలుసుకుని నీ చల్లని ఆశీస్సులు తీసుకోలేకపోతున్నాన్నాను. అందుకే ఇలా విషెస్ తెలుపుతున్నాను. నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మకి కూడా కావాలని ఆ భగవంతుడిని కోరుకుంటునన్నాను. ప్రేమతో.. శంకర్ బాబు` అని తన తల్లి అంజనాదేవితో కలిసి దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకున్నారు చిరంజీవి.

ఈ సందర్భంగా ఓ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. కొన్నేళ్ల క్రితం అంజనా దేవితో మెగా బ్రదర్స్ ముగ్గురు సోదరులు చిరంజీవి నాగబాబు పవన్ కల్యాణ్ కలిసి ఆనందక్షణాలని ఆస్వాదిస్తున్న ఓ ఫొటో ఇప్పుడు బయటికి వచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫొటోలో వున్న విశేషం ఏంటంటే ముగ్గురు బ్రదర్స్ యంగ్ గా కనిపిస్తున్నాం. దాదాపు పదిహేను ఇరవూఏళ్ల క్రితం దిగిన ఫొటోలా వుంది. తల్లి అంజనా దేవి పక్కన చిరు నాగబాబు నవ్వుతూ కనిపిస్తుండగా పవన్ కల్యాణ్ కాషాయ దుస్తుల్లో మాల ధరించి కనిపిస్తున్నారు.